Star Hero’s : సినిమాల కోసం జిమ్‌లో కష్టాలు పడుతున్న స్టార్ హీరోలు

 హీరోలంటే మంచి బాడీతో ఎప్పుడూ ఫిట్ గా కనిపించాలి. సిక్స్ ప్యాక్ చేసి ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయాలి. అందకే స్టార్ హీరోలు ఫిట్ నెస్ కోసం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ ను బట్టి బాడీని........

Star Hero’s : సినిమాల కోసం జిమ్‌లో కష్టాలు పడుతున్న స్టార్ హీరోలు

Heros In Gym

Star Hero’s :  హీరోలంటే మంచి బాడీతో ఎప్పుడూ ఫిట్ గా కనిపించాలి. సిక్స్ ప్యాక్ చేసి ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయాలి. అందకే స్టార్ హీరోలు ఫిట్ నెస్ కోసం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ ను బట్టి బాడీని పెంచుతూ, తగ్గించుకుంటున్నారు స్టార్ హీరోలు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా బాడీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు.

రామ్ చరణ్ తేజ్, శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న పాన్ ఇండియా సినమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు గా సిక్స్ ప్యాక్ లో ఫిట్నెస్ బాడీతో కనిపించి ఎట్రాక్ట్ చేసిన చరణ్, లేటెస్ట్ గా మూడు రకాల వేరియేషన్స్ తో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అందుకోసం బాడీని పెంచుతూ, తగ్గిస్తూ క్యారెక్టర్ కు అనుకూలంగా మారిపోతున్నాడు. రీసెంట్ గా చరణ్ ఇంట్లో ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

Hero’s Remunaration : ఇక్కడ 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటేనే అమ్మో.. కానీ అక్కడ 1000 కోట్లు అంటే లెక్కేలేదు..

రాధేశ్యామ్ తర్వాత బొద్దుగా తయారైన ప్రభాస్ నెక్ట్స్ చేయబోతున్న ప్రాజెక్ట్ కె, సలార్, ఆదిపురుష్ సినిమాల కోసం వర్కవుట్స్ చేసి, బాడీని తగ్గించి మళ్లీ హాండ్సమ్ లుక్ లోకి వచ్చేశాడు. పుష్ప2 కోసం అల్లు అర్జున్ కూడా తన బాడీ ఫిట్ నెస్ తో పాటు, డాన్ లుక్ లో కనిపించేందుకు భారీగానే కసరత్తులు చేశాడు. ఇక ట్రిపుల్ ఆర్ లో కొమురంభీమ్ గా చూపించిన ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకోసం మేకోవర్ చేంజ్ చేసి, మరింత పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తన బాడీ చూపించని విజయ్ దేవరకొండ కూడా పూరీ డైరెక్షన్ లో ఫుల్ న్యూడ్ గా, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆడియన్స్ నే కాదు, స్టార్ హీరోయిన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేశాడు. లైగర్ కోసం ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసి, మైక్ టైసన్ కి అపోజిట్ గా బాక్సింగ్ రింగ్ లోకి దిగుతున్నాడు.

నాగచైతన్య విక్రమ్ కె కుమార్ తో చేస్తున్న థాంక్యూ సినిమాకి మూడు వేరియేషన్స్ లో కనిపించడానికి చాలానే కష్టపడ్డాడు. అఖిల్ కూడా అంతే ఏజెంట్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తున్నాడు. కొడుకులే ఇలా ఉంటే తండ్రి నేనేమన్నా తక్కువా అన్నట్టు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్టుంటాడు. 60దాటినా లుక్ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తుంటాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రజెంట్ ప్రవీణ్ సత్తారు తో చేస్తున్న ది ఘోస్ట్ కోసం పర్సనల్ ట్రెయినింగ్ తీసుకుని ఇంకాస్త ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇలా చాలా మంది స్టార్ హీరోలు, యువ హీరోలు సినిమా కోసం తమ బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ క్యారెక్టర్ కోసం కావాల్సినట్టుగా చేంజ్ అవుతున్నారు.