Hero’s Remunaration : ఇక్కడ 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటేనే అమ్మో.. కానీ అక్కడ 1000 కోట్లు అంటే లెక్కేలేదు..

ఒక్క హాలీవుడ్ టాప్ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ పెట్టి కనీసం 10 కెజిఎఫ్ సినిమాలు తీసెయ్యొచ్చు. అవును అక్షరాలా వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్ తో అందరినీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో ఉన్నారు టామ్ క్రూజ్. ఇటీవలే టాప్ గన్ మెవరిక్ సినిమాలో.....

Hero’s Remunaration : ఇక్కడ 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటేనే అమ్మో.. కానీ అక్కడ 1000 కోట్లు అంటే లెక్కేలేదు..

Hollywood

 

Hero’s Remunaration :  మనహీరోలకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటేనే అమ్మో అంటూ నోరేళ్ళబెడుతున్నాం. మరి హాలీవుడ్ హీరోల మనీమ్యాటర్ తెలిస్తే కళ్లు గిర్రున తిరగడం ఖాయం. అసలు హాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ తో ఇప్పటి వరకూ మనం ఒక సినిమా కూడా తీసే సాహసం చెయ్యలేదంటే అది ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి. అసలు ఊహకు కూడా అందనంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు హాలీవుడ్ హీరోలు. ఒక్క సినిమాకి 100కోట్లంటేనే అమ్మో అనుకుంటున్నాం. కానీ హాలీవుడ్ హీరోలు వంద కోట్లు దాటి వేలకోట్ల వైపు పరిగెడుతున్నారు.

ఒక్క హాలీవుడ్ టాప్ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ పెట్టి కనీసం 10 కెజిఎఫ్ సినిమాలు తీసెయ్యొచ్చు. అవును అక్షరాలా వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్ తో అందరినీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో ఉన్నారు టామ్ క్రూజ్. ఇటీవలే టాప్ గన్ మెవరిక్ సినిమాలో బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్ తో సూపర్ సక్సెస్ చేసిన టామ్ క్రూజ్ ఈ సినిమాకి 800 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ప్రొడ్యూసర్ కావడంతో ప్రాఫిట్ షేర్ దాదాపు 200 కోట్లు కలిపి వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్ దక్కించుకున్నారు. జస్ట్ ఒక్క సినిమాకి వెయ్యికోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని హాలీవుడ్ హీరోల్లో నంబర్ వన్ ప్లేస్ కొట్టేశారు టామ్ క్రూజ్.

Akshay Kumar : కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తే తప్పేంటి..? ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్న అక్షయ్..

టామ్ క్రూజ్ తర్వాత జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రేగ్ 800కోట్లు తీసుకుంటున్నారు. ఇక యాక్షన్ హీరో డ్వైన్ జాన్సన్ రెడ్ వన్ మూవీ కోసం దాదాపు 400 కోట్లు తీసుకున్నాడు. హీరో విల్ స్మిత్ ఒక్కో సినిమాకి 300కోట్లు తీసుకుంటారు. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోకి ఫుల్ క్రేజ్ ఉంది హాలీవుడ్ లో లియెనార్డో సినిమాలకు మినిమం 300కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారు. ఇక క్రిస్ హేమ్స్ వర్త్ , విన్ డీజిల్, స్పైడర్ మ్యాన్ టామ్ హార్డీ, ర్యాన్ రెనాల్డ్స్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోలందరూ 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సినిమా బడ్జెట్ వేల కోట్లలో ఉంటే వారి రెమ్యూనిరేషనే అందులో 15 నుంచి 20 పర్సెంట్ ఉంటుంది అంటే వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాళ్ళు అలా వందలు, వేల కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటుంటే సూపర్ అంటాము కానీ మన హీరోలు 100 కోట్లు తీసుకుంటే మాత్రం అమ్మో అంతా అంటాం.