Police Stories : మళ్ళీ పోలీస్ స్టోరీల వైపుకు మళ్ళిన సినిమాలు.. పోలీస్ కథలే కావాలంటున్న హీరోలు..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోలవరకూ పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ నే చూజ్ చేసుకుంటున్నారు.

Police Stories : మళ్ళీ పోలీస్ స్టోరీల వైపుకు మళ్ళిన సినిమాలు.. పోలీస్ కథలే కావాలంటున్న హీరోలు..

Heros wants Police Story movies

Police Stories :  లవ్ స్టోరీలు, రొమాంటిక్ స్టోరీల సంగతేమో కానీ ఇప్పుడు అంతా యాక్షన్(Action) సినిమాలదే హవా. సౌత్(South) టూ నార్త్(North) వరస పెట్టి యాక్షన్ సినిమాల మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు హీరోలు. అవి కూడా కాప్ యాక్షన్ మూవీస్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ కెరీర్ లో మాస్ అప్పీల్, క్రేజ్ క్రియేట్ చేసే పోలీస్(Police) స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోలవరకూ పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ నే చూజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటింగ్ క్రేజీ కాప్ స్టోరీస్ లో విపరీతమైన అంచనాలు ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టాయి పోలీస్ రోల్స్. అందుకే ఈ సారి కూడా పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో ఉస్తాద్ భగత్ సింగ్ గా రాబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన హరీశ్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి ఈ సారి డోస్ పెంచి మరీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.

కెరీర్ లోనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు నాగచైతన్య. ఇప్పటి వరకూ చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కస్టడీ. టైటిల్ తోనే కోర్ పోలీస్ స్టోరీ అంటూ క్లియర్ గా చెప్పేశారు కస్టడీ టీమ్. ఇప్పటి వరకు సాఫ్ట్ స్టోరీస్ మాత్రమే చేసిన నాగచైతన్య.. యాక్షన్, ఎమోషన్, రివేంజ్ ఇలా ప్రతి ఎమోషన్ ని చూపిస్తూ చేసిన కస్టడీ మే 12న రిలీజ్ అవుతోంది. ఇందులో నాగ చైతన్య కానిస్టేబుల్ గా కనిపిస్తాడని సమాచారం.

Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

సీనియర్ హీరో వెంకటేష్ కూడా పవర్ ఫుల్ పోలీస్ గానే వస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు వెంకటేష్. ఈమధ్య కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న వెంకటేష్ ఘర్షణని మించి మాస్ కాప్ యాక్షన్ రివేంజ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది.

Senior Hero’s : సీనియర్ హీరోలకు కష్టమే.. యువ హీరోయిన్స్ తోనే సినిమాలు..

నాంది సినిమా నుంచి కెరీర్ లో మరో యాంగిల్ ని చూపిస్తున్న వర్సెటైల్ హీరో నరేష్ అప్ కమింగ్ మూవీ కూడా పోలీస్ స్టోరీయే. నాంది, మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సాలిడ్ పర్ఫామెన్స్ స్టోరీస్ లిస్ట్ లోకి ‘ఉగ్రం’ని కూడా యాడ్ చేస్తున్నారు నరేష్. నాంది కాంబినేషన్ తోనే తెరకెక్కుతున్న ఈ ఉగ్రం మూవీ ఇప్పటికే టీజర్లు, పాటలతో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో నరేష్ కెరీర్ లోనే పవర్ ఫుల్ గా పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగ్రం మే 5న రిలీజ్ కాబోతుంది.

నాని త్వరలో హిట్ 3 సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఇటీవల పలువురు యువ హీరోలు కూడా పోలీస్ పాత్రల్లో కనిపించి అలరించారు. అడివి శేష్ హిట్ 2 సినిమాలో, కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాలో.. ఇలా అందరూ ఇప్పుడు పోలీస్ పాత్రలవైపు పడుతున్నారు.