Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

తాజాగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన విషయాలతో పాటు కూతురు రాహా కపూర్ గురించి, భార్య ఆలియా భట్ గురించి, వారి మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తూ తను మాత్రం మంచి భర్తను కానని చెప్పాడు రణ్‌బీర్ కపూర్.

Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

Ranbir Kapoor comments he is not a good husband

Ranbir Kapoor :  బాలీవుడ్(Bollywood) క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) ఇప్పుడు అందరికి ఫేవరేట్. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ కొన్నేళ్ళపాటు ప్రేమలో ఉండి గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటైంది. ఇటీవలే ఓ కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు రాహా కపూర్(Raha Kapoor). ఇటీవలే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన విషయాలతో పాటు కూతురు రాహా కపూర్ గురించి, భార్య ఆలియా భట్ గురించి, వారి మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తూ తను మాత్రం మంచి భర్తను కానని చెప్పాడు రణ్‌బీర్ కపూర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ కు భార్యగా, తల్లిగా రేటింగ్ ఇవ్వమని అడిగితే ఆమె పాత్ర రెండిటిలోనూ అద్బుతమని చెప్పాడు రణ్‌బీర్. ఇంకా చెప్పాలంటే భార్యగా కంటే గొప్ప తల్లిగా ఉంటుందని బదులిచ్చాడు రణ్‌బీర్.

తనకి కూతురు పుట్టిన తర్వాత ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని, ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలోని టెక్నిక్స్ తెలుసుకున్నానని చెప్పాడు. కూతురు పుట్టాక తను చాలా మారానని, ఆమె తప్ప తనకు వేరే ప్రపంచమే లేదని చెప్పాడు రణబీర్ కపూర్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం భార్య, కూతురికి మంచి మార్కులిచ్చి తను మాత్రం మంచి భర్త కానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం తన జీవితంలో తండ్రి, భర్త, కొడుకు, హీరో.. ఇలా అన్ని పాత్రలు ఉన్నాయి, వాటిలో తను బెటర్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే మంచి భర్తనని మాత్రం తను భావించడం లేదని తెలిపాడు రణ్‌బీర్. పెళ్ళయిన తర్వాత అన్ని విధాలుగానూ పర్ఫెక్ట్ అవ్వడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, నేను భర్తగా ఇంకా మెరుగుపడాలని అనుకుంటున్నట్టు రణ్‌బీర్ తెలపడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి రణ్‌బీర్ ఈ వ్యాఖ్యలను ఏ విషయంలో ఉద్దేశించి అన్నాడో అతనికే తెలియాలి. దీంతో రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.