Rangasthalam : బన్నీ తర్వాత హిందీలోకి రామ్ చరణ్ సినిమా..

సుకుమార్ - రామ్ చరణ్‌ల బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ త్వరలో హిందీలో విడుదల కాబోతోంది..

Rangasthalam : బన్నీ తర్వాత హిందీలోకి రామ్ చరణ్ సినిమా..

Rangasthalam

Rangasthalam: మన తెలుగు సినిమాలు నార్త్‌లో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. రోజురోజుకీ మన సినిమాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి.

Ala Vaikunthapurramuloo : హిందీలో ‘అల..వైకుంఠపురములో’..

అలాగే ప్రస్తుతం పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు హిందీలో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేంత డిమాండ్ పెరిగింది తెలుగు సినిమాలకి. ‘బాహుబలి’ తో రాజమౌళి-ప్రభాస్ మన తెలుగు సినిమా స్టామినా ఏంటనేది బాలీవుడ్ జనాలకి చూపించారు.

Pragathi : ‘ఊ అంటావా మావా’.. ప్రగతి డ్యాన్స్ అరుపులు అంతే!

రీసెంట్‌గా ‘పుష్ప’ తో బన్నీ ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాడో చూశాం. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ‘అల..వైకుంఠపురములో’ మూవీని హిందీలో డబ్ చేసి, జనవరి 26న భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

Bangarraju : ‘బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..

ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిలిం ‘రంగస్థలం’ హిందీలోకి వెళ్లబోతోంది. గతేడాది తమిళ్‌లో రిలీజ్ చేశారు. బన్నీ, చరణ్ సినిమాల హిందీ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో హిందీలో ‘రంగస్థలం’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Rangasthalam Hindi