HIT 2: హిట్-2 విషయంలో మేకర్స్ ఆ తప్పు చేశారా..?

యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి సస్పెన్స్ అంశాలతో తెరకెక్కించగా, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

HIT 2: హిట్-2 విషయంలో మేకర్స్ ఆ తప్పు చేశారా..?

HIT 2 Makers Mistake Of Revealing HIT 3 Hero

HIT 2: యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి సస్పెన్స్ అంశాలతో తెరకెక్కించగా, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తొలి షోకే పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించింది. కానీ, ఈ ప్రమోషన్స్‌లో వారు ఓ తప్పు చేశారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

HIT 2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న హిట్ 2.. అందులోనే స్ట్రీమింగ్!

హిట్-2 చిత్ర ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఏం తప్పు చేసిందా అని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే.. హిట్ తొలి భాగం రిలీజ్ అయినప్పుడు సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. ఆ సినిమా క్లైమాక్స్‌లో హిట్ సీక్వెల్ ఉంటుందని సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు. దీంతో వారు ఈ సీక్వెల్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. కానీ, ఈసారి హిట్-2 ప్రమోషన్స్‌లోనే హిట్ మూడో భాగం ఉంటుందని.. దాంట్లో నటించే హీరో ఎవరో హిట్-2 సినిమా క్లైమాక్స్‌లో చూపిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

Hit 2 : హిట్ 2 రివ్యూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్స్‌లోనే చూడాలి..

ఇప్పుడు ఆడియెన్స్‌కు నెక్ట్స్ పార్ట్ మూవీ గురించి ముందే చెప్పేస్తే వారికి ఆ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హిట్-2 క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్టు ఏమిటో జనాలు చర్చించుకోవడం ఖాయం. అంతేగాక కొందరు హిట్-3 హీరో ఎవరో కూడా వీడియో తీసి పెట్టేస్తారు. దీంతో సినిమా చూడని వారికి సైతం హిట్-3 హీరో ఎవరనేది తెలిసిపోతుంది. ఇలా సినిమా ప్రమోషన్స్‌లో హిట్-3 ప్రస్తావన చేయకుండా, సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేసుంటే, థియేటర్లలో సినిమా చూసే వారికి ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఖచ్చితంగా లభించేది. మరి ఈ విషయంలో నిజంగానే మేకర్స్ తప్పు చేశారా అనేది సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తేలిపోనుంది.