War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..

హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన వార్ (War) సినిమా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కథ సల్మాన్ (Salman Khan) టైగర్ 3 కి కొనసాగింపుగా ఉండనుంది అంటూ ప్రకటించారు.

War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..

Hrithik Roshan entered into spy universe with war 2 continue to salman khan tiger 3 - Pic Source Twitter

War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) సినిమాలకు సౌత్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ధూమ్ 2, క్రిష్, సినిమాలతో హృతిక్ సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరో నటించిన యాక్షన్ మూవీస్ తెలుగులో కూడా డబ్ రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం హృతిక ఫైటర్ (Fighter) అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) డైరెక్టర్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ దర్శకుడు పఠాన్ (Pathaan) మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

Brahmastra : బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్స్ ప్రకటించిన దర్శకుడు..

గతంలో ఈ దర్శకుడు, హృతిక్ తో కలిసి రెండు సినిమాలు తెరకెక్కించాడు. బ్యాంగ్ బ్యాంగ్, వార్.. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా వార్ (War) సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల తమ పఠాన్ సినిమాలోకి టైగర్ (Ek Tha Tiger, Tiger Zinda Hai) సిరీస్ లోని సల్మాన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు వార్ 2 ని ప్రకటించి స్పై యూనివర్స్ లోకి హృతిక్ ని కూడా తీసుకు రాబోతున్నారు.

Ram Charan : సల్మాన్ అండ్ వెంకీ మామతో చరణ్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ టైగర్ 3 ని తెరకెక్కిస్తుంది. మనీష్ శర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టైగర్ 3 కి కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కబోతుంది అంటూ తెలియజేశారు. ఇక వార్ ఫస్ట్ పార్ట్ ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.