Brahmastra : బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్స్ ప్రకటించిన దర్శకుడు..

ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి డైరెక్టర్ సర్ ప్రైజ్ చేశాడు.

Brahmastra : బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్స్ ప్రకటించిన దర్శకుడు..

Ayan Mukerji announces Brahmastra part 2 and 3 dates - Pic Source Twitter

Updated On : April 4, 2023 / 2:50 PM IST

Brahmastra : బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) కలిసి నటించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), నాగార్జున ముఖ్య పాత్రల్లో మెరవగా.. అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రధాన పాత్రలు చేశారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Ram Charan : సల్మాన్ అండ్ వెంకీ మామతో చరణ్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

మొదటి పార్ట్ శివ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మిగిలిన పార్ట్స్ పై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో అనేక రూమర్లు మొదలయ్యి. తాజాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ దర్శకుడు అయాన్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఒకేసారి మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. సెకండ్ పార్ట్ ‘దేవ్’ని (Dev) 2026 డిసెంబర్ లో, మూడో భాగం ‘బ్రహ్మాంష్’ని (Brahmansh) 2027 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ రెండు పార్ట్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Baby Movie : ‘బేబీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ స్టార్ సింగర్.. సూపర్ అంటున్న మ్యూజిక్ లవర్స్!

మొదటి భాగానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్ట్స్ ని మరింత బెటర్ గా తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. కాగా సెకండ్ పార్ట్ దేవ్ లో టైటిల్ రోల్ ని ఎవరు పోషిస్తున్నారు అనే దాని పై చాలా క్యూరియాసిటీ నెలకుంది. మొదటి భాగంతో ఆ పాత్ర పై చాలా హైప్ కలగడంతో.. ఆ పాత్రని పలానా స్టార్ హీరో చేయబోతున్నాడు అంటూ రోజుకో వార్త బయటకి వస్తుంది. మరి చివరికి ఆ పాత్ర ఎవరు చేస్తారో చూడాలి.