NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఫిక్స్.. పుట్టిన రోజు నాడు క్లారిటీ ఇచ్చేసిన హృతిక్.. జోష్ లో ఫ్యాన్స్..

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు హృతిక్ చేసిన ట్వీట్ వైరల్ గామారింది. హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఫిక్స్.. పుట్టిన రోజు నాడు క్లారిటీ ఇచ్చేసిన హృతిక్.. జోష్ లో ఫ్యాన్స్..

Hrithik Roshan gives clarity on NTR IN War 2 Movie

WAR 2 :  యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో దేవర(Devara) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, అందాల భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బాలీవుడ్(Bollywood) కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు, వార్ సీక్వెల్ సినిమాలో హృతిక్ తో కలిసి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు హృతిక్ చేసిన ట్వీట్ వైరల్ గామారింది. హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

హృతిక్ తన ట్వీట్ లో.. హ్యాపీ బర్త్ డే తారక్. ఈ సంవత్సరం ఆనందంగా, యాక్షన్ గా ఉండాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను, పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అని రాశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంగ్లీష్, తెలుగు మిక్స్ చేసి హృతిక్ ఈ ట్వీట్ చేశాడు. వార్ అని డైరెక్ట్ పదం వాడకుండా యుద్ధభూమి అని వాడాడు. ఇక త్వరలోనే కలుస్తున్నామని చెప్పాడు.

NTR 100 Years: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవుతున్న ఇండస్ట్రీ హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరం..

హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో కచ్చితంగా నటించబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సూపర్ అప్డేట్ ఇచ్చారని హృతిక్ కు థ్యాంక్స్ చెప్తున్నారు. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సూపర్ హిట్ వార్ సినిమాకు వార్ 2 సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై చిత్రాలలో వార్ 2 తెరకెక్కబోతుంది.