NTR 100 Years: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవుతున్న ఇండస్ట్రీ హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరం..

టీడీపీ నేత జనార్దన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాల సభను నేడు మే 20 సాయంత్రం 5 గంటల నుండి KPHB లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ భారీ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తాత్రేయ, బాలకృష్ణ, సీతారాం ఏచూరి, D రాజా, పురంధేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్.. పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు.

NTR 100 Years: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవుతున్న ఇండస్ట్రీ హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరం..

Junior NTR not attending to NTR 100 Years event in Hyderabad

Updated On : May 20, 2023 / 10:16 AM IST

100 Years of NTR : 2023 మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉండటంతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం(Telugu Desam) కార్యకర్తలు గత సంవత్సర కాలంగా ఎన్టీఆర్(NTR) శత జయంతి ఉత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ(Vijayawada)లో భారీ సభ నిర్వహించగా రజినీకాంత్(Rajinikanth) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇదే విధంగా ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలలో భాగంగా హైదరాబాద్ లో కూడా భారీగా సభ నిర్వహిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాల సభను నేడు మే 20 సాయంత్రం 5 గంటల నుండి KPHB లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ భారీ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తాత్రేయ, బాలకృష్ణ, సీతారాం ఏచూరి, D రాజా, పురంధేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్.. పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు.

అలాగే ఈ సభకు ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, రానా, శివరాజ్ కుమార్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. మరింతమంది హీరోలు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి రమ్మని అధికారికంగా వీరందరికి ఆహ్వానాలు పంపించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం స్వయంగా అందించారు.

Rajamouli Family : సింహాద్రి రీ రిలీజ్ లో రాజమౌళి ఫ్యామిలీ హంగామా.. ఎవరెవరు వచ్చారో తెలుసా?

కానీ నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ముందుగానే తన ఫ్యామిలీతో ఏర్పాటు చేసుకున్న కమిట్మెంట్స్ ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సభకు హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు. ఇంతమంది హీరోలు, సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్న తరుణంలో, ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్, తెలుగు రాజకీయాల్లో చర్చ కూడా మొదలైంది. నేడు జరగనున్న ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి పిలిచిన అందరు హీరోలలో కొంతమంది రాకపోతే ఎవరూ పట్టించుకోరు కానీ, అందరూ వచ్చి ఒక్క ఎన్టీఆర్ మాత్రం రాకపోతే అది కచ్చితంగా పెద్ద వార్త అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.