Krrish 4: మళ్ళీ డిసప్పాయింటేనా హృతిక్.. క్రిష్ 4 ఎప్పుడు సామి?!

అదిగో ఇదిగో అని ఆశపెట్టి మళ్లీ డిసప్పాయింట్ చేశారు హృతిక్ రోషన్. బర్త్ డే రోజు ఇంట్రస్టింగ్ అప్ డేట్ అని ఊరించి ఊరించి ఏదో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ చెబుతారనుకుంటే..

Krrish 4: మళ్ళీ డిసప్పాయింటేనా హృతిక్.. క్రిష్ 4 ఎప్పుడు సామి?!

Krrish 4

Krrish 4: అదిగో ఇదిగో అని ఆశపెట్టి మళ్లీ డిసప్పాయింట్ చేశారు హృతిక్ రోషన్. బర్త్ డే రోజు ఇంట్రస్టింగ్ అప్ డేట్ అని ఊరించి ఊరించి ఏదో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ చెబుతారనుకుంటే.. గుడ్ న్యూస్ కాదు కదా.. అసలు ఉన్న సినిమా ఆశల మీదే నీళ్లు చల్లారు. ఇంతకీ ఇండియన్ సూపర్ హీరో మూవీ క్రిష్ కి పార్ట్ 4 ఉన్నట్టా..? లేనట్టా..?

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఈ సినిమాతో ఇండియన్ సూపర్ హీరోని ఆడియన్స్ ని పరిచయం చేశారు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా అంటూ క్రేజీ సూపర్ పవర్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కించేశారు. ఈ సినిమాకు కంటిన్యూషన్ గా వచ్చిన క్రిష్, క్రిష్ సీక్వెల్స్ సినిమా మీద ఎప్పటి కప్పుడు ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే క్రిష్ 4 ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకూ క్లారిటీ ఇవ్వడం లేదు హృతిక్.

Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

క్రిష్ 4 మీద బాలీవుడ్ లో ఎప్పటి నుంచో హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ జూన్ 23న క్రిష్ 4 ఉంటుందని త్వరలోనే సెట్స్ మీదకెళుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు హృతిక్ రోషన్. క్రిష్ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మాత్రం.. క్రిష్ 4 ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా లేదని తేల్చేశారు. క్రిష్ 4ని పోయిన సంవత్సరమే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు హృతిక్ అండ్ టీమ్.

Boyapati-Pawan: బోయపాటితో పవర్ స్టార్.. ఇది సెట్టయ్యే కాంబినేషనేనా?

కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ ఇంకా సెటిల్ కాలేదు.. ఇప్పటికే పెద్ద బడ్జెట్ సినిమాలతో ప్రొడ్యూసర్లు పీకల్లోతు నష్టాల్లో ఉన్నారు కాబట్టి.. తెలిసి తెలిసి ఈ ప్రాబ్లమ్ లో పడడం ఇష్టం లేదంటున్నారు రాకేష్ రోషన్. అందుకే ఎప్పుడు ఈపాండమిక్ సిచ్యువేషన్ అయిపోయి.. సేఫ్ గా షూటింగ్ జరిపే పరిస్తితులుంటాయో అప్పుడు క్రిష్ 4 స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు హృతిక్ అండ్ యూనిట్. సొ.. హృతిక్ బర్త్ డే కి క్రిష్ 4 అనౌన్స్ మెంట్ వస్తుందేమో అనుకున్నవాళ్లకి.. ఆ గుడ్ న్యూస్ కోసం ఇంకొంతకాలం వెయిట్ చెయ్యాల్సిందే.