Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది.

Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

Siddharth Saina Nehwal

Siddharth-Saina Nehwal: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది. దీంతో చివరికి హీరో సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పక తప్పలేదు. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతాలోపాన్ని ప్రస్తావించిన సైనా.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Siddharth-Saina : సైనా​పై హీరో సిద్ధార్థ్ ట్వీట్..జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం..అతడి ఖాతా డిలీట్ చేయాలని లేఖ

అయితే.. సైనా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సిద్దార్థ్.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు.. అంటూ కామెంట్ చేయడంతో అసలు వివాదం మొదలైంది. సైనాపై సిద్దార్థ్ వేసిన అసభ్యకరమైన జోక్‌ పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని పట్ల వ్యతిరేకతను సిద్దార్థ్ సైనాపై చూపించడం… అదీ అసభ్యకరమైన భాషను వాడటం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ట్విట్టర్ ద్వారా సైనాకు క్షమాపణలు చెప్పడంతో పాటు వివరణ ఇచ్చుకున్నాడు.

Chinmayi: వెధవైనా పర్లేదు సొంత క్యాస్ట్‌లోనే పెళ్లి.. చిన్మయి కామెంట్స్!

‘కొద్దిరోజుల క్రితం మీ ట్వీట్‌పై స్పందిస్తూ నేను వేసిన రూడ్ జోక్‌కి క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించకపోవచ్చు. మీ ట్వీట్‌ని చదివినప్పుడు నిరాశతో లేదా కోపంతో నేను ఉపయోగించిన పదాలు, నా స్వరాన్ని సమర్థించుకోలేను. నాకు తెలుసు నేను అంతకుమించి దయ కలిగి వున్నాను. ఒక జోక్‌కి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మంచి జోక్ కాదనే అర్థం. అలాంటి జోక్‌ను వాడినందుకు క్షమాపణలు.’ అని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.

Sankranti Films: ఈ సంక్రాంతి మాదే.. పెద్ద పండగకి చిన్న హీరోల సందడి!

‘చాలామంది వ్యక్తులు ఆపాదించినట్లుగా తన ట్వీట్‌లో హానికరమైన ఉద్దేశమేమీ లేదని సిద్దార్థ్ పేర్కొన్నారు. తాను కూడా స్త్రీ పక్షపాతినే అని.. తన ట్వీట్‌లో లింగపరమైన విషయమేమీ లేదని… మీరొక మహిళ కాబట్టి మీపై దాడి చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అన్నారు. ఇదంతా పక్కనపెట్టి.. మీరు నా లేఖ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, ‘మీరెప్పటికీ నా ఛాంపియనే’ అని చెప్పుకొచ్చారు. సిద్దార్థ్ క్షమాపణలు చెప్పడం సమంజసంగానే ఉన్నా.. సైనా అండ్ కో ఎలా తీసుకుంటారు.. ఇక ఈ వివాదం ముగిసినట్లేనా అనేది చూడాల్సి ఉంది.