Sankranti Films: ఈ సంక్రాంతి మాదే.. పెద్ద పండగకి చిన్న హీరోల సందడి!

సంక్రాంతి వీక్ వచ్చేసింది. నిజానికి ఈపాటికే పెద్ద సినిమాల సంబరాలతో థియేటర్స్ కి కొత్త కలరింగ్ రావాల్సింది. కానీ ఒమిక్రాన్ దెబ్బకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వెనక్కి తగ్గితే..

Sankranti Films: ఈ సంక్రాంతి మాదే.. పెద్ద పండగకి చిన్న హీరోల సందడి!

Sankranti Films

Sankranti Films: సంక్రాంతి వీక్ వచ్చేసింది. నిజానికి ఈపాటికే పెద్ద సినిమాల సంబరాలతో థియేటర్స్ కి కొత్త కలరింగ్ రావాల్సింది. కానీ ఒమిక్రాన్ దెబ్బకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వెనక్కి తగ్గితే.. తెలుగు రాష్ట్రాల్లో లీడ్ తీసుకున్నాడు బంగార్రాజు. మరికొంతమంది యంగ్ హీరోలు సైతం సంక్రాంతిని టార్గెట్ చేసి ఈ వారం వచ్చేస్తున్నరు.

Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

జనవరి 14న రాబోతున్నాడు బంగార్రాజు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పెద్ద పండక్కి రాబోతున్న పెద్ద బొమ్మంటే బంగార్రాజుదే. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా తయారైన ఈ మూవీలో నాగ్, చైతూ కలిసి నటించడం.. రమ్యకృష్ణ, కృతిశెట్టి, ఫరియా అబ్దుల్లాతో పాటూ మొత్తం 8మంది హీరోయిన్స్ ఉండటం.. కామెడీ ట్రాక్స్ కలిసొచ్చే అంశాలు. పోటీలో పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో పాటలు, ఈవెంట్స్ తో జనాలను బాగానే ఎంగేజ్ చేస్తున్నారు టీమ్. జనవరి 14కి వచ్చిన దసరా బుల్లోడిలా ఈ బంగార్రాజు హిట్టు కావడం ఖాయమన్నారు నాగ్. జనవరి 11న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.

Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో రౌడీబాయ్స్ ఈ పండక్కే వచ్చేస్తోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రొడ్యూసర్ శిరీష్ కొడుకు ఆశిష్ హీరో కాగా అనుపమ పరమేశ్వరన్ లేడీ లీడ్ తీసుకుంది. శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన రౌడీబాయ్స్ కి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించడం ప్లస్ పాయింట్. దిల్ రాజు బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి జనాల్లోకి సినిమాను తక్కువ టైంలో తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా తారక్ చేతులమీదుగా రౌడీ బాయ్స్ ట్రైలర్ రిలీజైంది.

Bangarraju: అక్కినేని హీరోల దూకుడుకి బ్రేకేసిన కోవిడ్..!

బంగార్రాజు, రౌడీబాయ్స్, డిజె టిల్లులతో పాటూ జనవరి 14న సూపర్ మచ్చి కూడా వచ్చేస్తోంది. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు తెరకెక్కించాడు ఈ సినిమాని. కన్నడ హీరోయిన్ రుచిత రామ్ కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారిందులో. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచిన సూపర్ మచ్చి టీమ్ సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

సూపర్‌స్టార్‌ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా హీరోగా హీరో సినిమా తెరకెక్కింది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా మెరిసిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా ఈనెల 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తిరుపతిలో జరగాల్సిన హీరో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గట్టమమేని రమేష్‌ బాబు కన్నుమూసిన కారణంగా రద్దయింది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన హీరో సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.

Shruti Haasan: లవ్ ఎఫైర్.. నేనే ముందంటూ శృతి బోల్డ్ స్టేట్మెంట్!

ఇక ఈ సంక్రాంతికే రెండోసారి నాపేరు శివ అంటూ కార్తీ వచ్చేస్తున్నాడు. డైరెక్టర్ పా రంజిత్, కార్తీ కాంబోలో తెరకెక్కిన మెడ్రాస్ సినిమాను గతంలోనే మద్రాస్ పేరుతో డబ్ చేశారు. ఈసారి దానికి పేరు మార్చి నా పేరు శివ2 అని కొత్త కలరింగ్ ఇచ్చారు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్. జనవరి 15న తెలుగు థియేటర్స్ లోకి ఈ తమిళ్ డబ్బింగ్ సినిమా ఎంట్రీ ఇవ్వనుంది.