Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

వెర్సటైల్ యాక్టర్ గా పేరున్న ధనుష్ ప్రస్తుతం ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న వెంకీ..

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

Sir Movie

Sir Movie: వెర్సటైల్ యాక్టర్ గా పేరున్న ధనుష్ ప్రస్తుతం ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి తన నాలుగో సినిమాగా ధనుష్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ను అందించబోతున్నాడు. ఆ సినిమా టైటిల్ కూడా సార్ అని పెట్టడంతో ఆసక్తికరంగా అందరి దృష్టిని ఆకర్శించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించడం విశేషం.

Sakshi Dwivedi: కుర్రాళ్ళ తెగ టెంప్ట్ చేసేస్తున్న సాక్షి ద్వివేది!

ఇక, ఈ సినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్తనే ఈ సినిమా కోసం ఫైనల్ చేయడం అప్పుడు ఆసక్తి కరంగా చెప్పుకున్నారు. భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మించడం.. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే అందించే త్రివిక్రమ్ ధనుష్ సార్ సినిమాకు సహా నిర్మాతగా మారడం.. హీరోయిన్ ను ఆ సినిమాలో నటించిన సంయుక్తనే తీసుకోవడం ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది.

Varshini Sounderajan: క్లీవేజ్ సోకులతో చంపేస్తున్న వర్షిణి!

అయితే, ఇప్పుడు సార్ సినిమా నుండి సంయుక్త మీనన్ ను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పదన రాకాపోగా సంయుక్త సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ సినిమా అప్డేట్స్ గురించి పోస్టులు ఇంకా అలాగే ఉన్నాయి. దీంతో ఈ ప్రచారం నిజమా కదా అన్నది తెలియాల్సి ఉంది.