Siddharth-Saina : సైనా​పై హీరో సిద్ధార్థ్ ట్వీట్..జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం..అతడి ఖాతా డిలీట్ చేయాలని లేఖ

బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.

Siddharth-Saina : సైనా​పై హీరో సిద్ధార్థ్ ట్వీట్..జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం..అతడి ఖాతా డిలీట్ చేయాలని లేఖ

Siddharth Saina

Siddharth saina nehwal: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్​ చేయాలని ట్విట్టర్​ ఇండియాకు లేఖ రాసింది. సైనా నెహ్వాల్​పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.

Read more : RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం : ఆర్జీవీ

ఇంతకీ సైనా ఏం ట్వీట్ చేసింది? దానికి సిద్ధార్ధ ఏం ట్వీట్ చేశాడు? ఈ ట్వీట్ల రాద్ధాంతమేంటంటే.. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ పంజాబ్​ టూర్​లో ఆయన కాన్వాయ్ భద్రతా వైఫల్యం ఎంతగా దుమారం రేపిందో..దానికి సైనా మోడీకి మద్దతుగా పెట్టిన ట్వీట్..దానికి సిద్ధార్ధ పెట్టిన కామెంట్స్ అంతకంటే ఎక్కువ దుమారం రేపుతున్నాయి.

సైనా నెహ్వాల్.. ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే అప్పుడు ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు అంటూ జనవరి 5న ట్వీట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈ ట్వీట్​కు హీరో సిద్ధార్థ రీట్వీట్ చేస్తూ.. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా (భారత్​ను రక్షించేవారు ఉన్నారని, కాక్ ఛాంపియన్​ ఆఫ్ ద వరల్డ్​ )అంటూ ట్వీట్ చేశాడు.

Read more : RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

సిద్ధార్థ్ ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఖండించారు. అలా అనడం అవమానమంటూ సింగర్ చిన్మయి అసహనం వ్యక్తంచేశాయి. మహిళలను అవమానకరించేలా పదాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

దీంతో సిద్ధార్థ్.. సోమవారం మరో ట్వీట్ చేస్తు..నా కామెంట్స్ వక్రీకరించాలని కాక్ అండు బుల్ కథలు చెప్పారని వివరించాడు. నేను ఎటువంటి దురుద్దేశంతో ఈ కామెంట్​ చేయాలేదని వివరణ ఇచ్చాడు. సిద్ధార్థ్ ట్విట్టర్​ ఖాతాను తక్షణమే డిలీట్ చేయాలని మహిళా కమిషన్ ఛైర్మన్.. ట్విట్టర్​ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్​కు లేఖ రాశారు.

Read more : ఆర్జీవీ అమ్ముడుపోయాడు..!

అలానే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై షట్లర్ సైనా నెహ్వాల్ కూడా స్పందిస్తు..సిద్ధార్థ్​ను నటుడిగా ఇష్టపడతానని.. కానీ అతడి వ్యాఖ్యలు సరిగా లేవని..సరైన పదాలు ఉపయోగించి మాట్లాడాలని సూచించారు.