RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

ఆర్జీవీ-నాని భేటీతో సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల దృష్టి ఈ మీటింగ్ పైనే ఉంది. అమరావతి సెక్రెటేరియట్ చేరుకున్న ఆర్జీవీ పేర్ని నానితో కలిసే ముందు మీడియాతో ఆర్జీవీ మాట్లాడుతూ...........

RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

Rgv

AP Cinema Ticket Price Issue :  గత కొన్ని రోజులుగా ఏపీ సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ, ఏపీ ప్ర్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలు తెలిసిందే. సినిమా టికెట్ రేట్ల ధరలు బాగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా దీనిపై స్పందించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ట్విట్టర్లో ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నానిని ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ కి నాని కూడా స్పందించారు. ట్విట్టర్ లో రెండు రోజులు వార్ జరిగిన తర్వాత ఆర్జీవీ కలవడానికి పేర్ని నాని అపాయింట్మెంట్ ఇచ్చారు.

ఇవాళ ఉదయం ఆర్జీవీ హైదరాబాద్ నుంచి విజయవాడ విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి సెక్రెటేరియట్ కి వెళ్లారు. ఆర్జీవీ-నాని భేటీతో సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల దృష్టి ఈ మీటింగ్ పైనే ఉంది. అమరావతి సెక్రెటేరియట్ చేరుకున్న ఆర్జీవీ పేర్ని నానితో కలిసే ముందు మీడియాతో మాట్లాడారు.

Esha Chawla : కరోనా బారిన సెలబ్రిటీలు.. మరో హీరోయిన్ ఇషాచావ్లాకి పాజిటివ్

ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై నేను స్పందించను. ఇక్కడికి ఒక ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను. సినీ పరిశ్రమ తరపున రాలేదు. నాగార్జున వ్యాఖ్యలపై నేను స్పందించను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. నాకున్నట్లుగానే వారికీ అభిప్రాయాలు వుంటాయి. సినిమా టిక్కెట్ల ధరలపై నా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.” అని తెలిపారు.