RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం : ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ''అజయ్ గారు, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి. దాని మూలాన...

RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం : ఆర్జీవీ

Rgv

RGV :   గతంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం కొన్ని రోజులు చర్చలకు దారి తీసింది. ‘మా’ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ దాని గురించి మాట్లాడారు. ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, కానీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే మాత్రం ముందుకొస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసిన సాయంత్రానికి మోహన్ బాబు సినిమా టికెట్ల ఇష్యూ గురించి మాట్లాడుతూ లేఖ రాయడం మళ్ళీ ఈ విషయంపై టాలీవుడ్ లో చర్చకి దారి తీసింది.

అయితే ఈ విషయంపై ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్, ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ”మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ.. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా” అంటూ అజయ్ భూపతి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి తాజాగా రామ్ గోపాల్ వర్మ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

ఈ ట్వీట్‌పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ”అజయ్ గారు, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి. దాని మూలాన వారికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు. కానీ ఎవడికో పెద్ద దిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు” అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ రకంగా ఆర్జీవీ ఇండస్ట్రీ పెద్ద అనే అంశంపై తన అభిప్రాయం తెలియచేశాడు.