Gold Price Today May 19 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి..! ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదా? ఏపీ, తెలంగాణలో తులం రేటు ఇదే
Gold Price Today May 19 : బంగారం కొనేందుకు చూస్తున్నారా? బంగారం ఇప్పుడు కొనకపోవడమే బెటర్. పసిడి ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.. ఈరోజు తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

Gold Price Today May 19 : బాబోయ్.. బంగారం మళ్లీ పెరిగింది. బంగారం కొనేవారికి నిజంగా షాకింగ్ న్యూస్.. బంగారం కొనేవాళ్లు మరికొద్దిరోజులు ఆగడమే బెటర్. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల్లో బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు కూడా అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

దీని ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా 2 శాతం మేర క్షీణించాయి. ఇప్పడు ఇన్వెస్టర్లు చమురు మార్కెట్లో అమ్మకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో గోల్డ్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ బులియన్ ధరల్లో ఈరోజు (మే 19) మంగళవారం బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏపీ తెలంగాణ సహా పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గ్రామ్ గోల్డ్ ధర రూ.82 పెరిగింది. ఆపై రూ.15,704 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.75 పెరిగింది. ఆపై రూ.14,395 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములు రూ.7,500 పెరిగింది. ఆపై రూ. 14,39,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 5వేలు తగ్గి రూ. 2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 3 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలివే : హైదరాబాద్ సిటీలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.820 పెరిగింది. ఆపై రూ.1,57,040 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.1,43,950 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.820 పెరిగింది. ఆపై రూ.1,57,040 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగింది. ఆపై రూ.1,43,950 వద్ద ట్రేడ్ అవుతోంది.

విశాఖలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 పెరిగింది. ఆపై రూ.1,57,040 దగ్గర కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.750 పెరిగింది. ఆపై రూ.1,43,950 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇతర నగరాల్లో ధరలివే : దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,57,190 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 పెరిగింది. ఆపై రూ.1,57,040 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.750 పెరిగింది. ఆపై రూ.1,43,950 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,62,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,48,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 పెరిగింది. ఆపై రూ.1,57,040 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగింది. ఆపై రూ.1,43,950 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
