School Holiday: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు ఈజిల్లాల్లో స్కూల్స్ బంద్
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు సెలవులు(School Holiday) ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
srikakulam and vizianagaram private schools closed due to pm modi tour
- ప్రైవేటు పాఠశాలలకు రెండురోజులు సెలవులు
- ప్రభుత్వ బడులు యథావిధిగా నడుస్తాయి
- మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు
School Holiday: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముందస్తు ముస్తాబులు ముమ్మరమయ్యాయి. ఈ భారీ బహిరంగ సభకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో రవాణా సదుపాయాల కోసం ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల కొరత వల్ల విద్యార్థులు ఎదుర్కొనే ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు సెలవులు(School Holiday) ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ రెండు రోజులు ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా యథావిధిగా పనిచేస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వేలాది మంది ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో, ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
