Oppo Reno 16 Price : సూపర్ డీల్ భయ్యా.. ఈ కొత్త ఒప్పో ఫోన్ మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్..
Oppo Reno 16 Price : ఒప్పో రెనో 16 ధర భారీగా తగ్గింది.. అమెజాన్‌లో ఏకంగా రూ. 5వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Oppo Reno 16 Price
- అమెజాన్‌లో ఒప్పో రెనో 16 రూ. 5వేలకుపైగా తగ్గింపు
- బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ ద్వారా అదనపు ఆదా
- 120Hz అమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,700mAh బ్యాటరీ
Oppo Reno 16 Price : మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లాగ్షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం ఒప్పో రెనో 16 భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఒప్పో ఫోన్ చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా (Oppo Reno 16 Price) సెటప్ ఉంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో ఒప్పో రెనో 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒప్పో రెనో 16 అమెజాన్ డీల్ :
ఒప్పో రెనో 16 ధర ఇటీవలే పెరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 66,999కి చేరింది. ప్రస్తుతం ఈ ఒప్పో ఫోన్ అమెజాన్‌లో రూ. 61,104కే పొందవచ్చు. తద్వారా ధరపై రూ. 5,895 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ వడ్డీ మొత్తంపై రూ. 1,592.96 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.
Read Also : Vivo V80 Price : అద్భుతమైన ఫీచర్లతో కొత్త వివో V80 వస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
నెలకు కేవలం రూ. 2,148 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. తద్వారా కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుని రూ. 44వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్, బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది.
ఒప్పో రెనో 16 స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 16 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ 1,800 నిట్స్ టాప్ బ్రైట్నెస్ చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఒప్పో ఫోన్ 4 nm ప్రాసెస్‌పై క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ప్రాసెసర్‌కు 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే..
ఒప్పో రెనో 16 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో సోనీ LYT-600 సెన్సార్ ఉన్నాయి. ఈ సెటప్‌లో 50MP 3.5x టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఒప్పో ఫోన్ 100-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 16లో 6,700mAh భారీ బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోరుకునేవారికి అద్భుతమైన ఆఫర్ అని చెప్పొచ్చు.
