Vivo V80 Price : అద్భుతమైన ఫీచర్లతో కొత్త వివో V80 వస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
Vivo V80 Price : వచ్చే అక్టోబర్ 6న వివో వి80 ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత మార్కెట్లో ధర ఎంత ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..
Vivo V80 Price tipped
Vivo V80 Price : వివో ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. వివో నుంచి కొత్త వివో V80 స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. లాంచ్ తేదీని కంపెనీ ఇటీవల రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత వివో V70కి అప్‌గ్రేడ్ వెర్షన్‌తో రానుంది. ఈ వివో ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నివేదికల ప్రకారం.. వివో V80 ఫోన్ భారీ 7,200mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు. భారత మార్కెట్లో వివో V80 ధర ఎంత ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో V80 ధర (అంచనా) :
వివో రాబోయే వివో V80 ధరలను అధికారికంగా వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 63వేలు, 8GB + 256GB వేరియంట్‌కు రూ. 70వేలు, హై-ఎండ్ 8GB + 512GB వేరియంట్‌కు రూ. 80వేలు ఉండవచ్చు.
లాంచ్ తేదీ (ఖరారు) :
అక్టోబర్ 6న భారత మార్కెట్లో వివో V80 లాంచ్ కానుంది. ఈ ఫోన్ వివో అధికారిక స్టోర్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్లైన్ ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉండనుంది.
వివో V80 స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో V80 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌తో లాంచ్ కానుందని అంచనా. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, 5,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 7,200mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు. వివో V80, ఆండ్రాయిడ్ 17 ఆధారిత స్కిన్, ఒరిజిన్ఓఎస్ 7తో రావచ్చు. లీకుల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని అంచనా.
కెమెరా విషయానికి వస్తే..
ఈ హ్యాండ్సెట్ బ్యాక్ సైడ్ జైస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుందని అంచనా. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్ 100x వరకు డిజిటల్ జూమ్‌ను అందించే 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు. 50MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనా. ఈ వివో ఫోన్ సన్‌రైజ్ ఆంథెమ్, హొరైజన్ బ్లూ స్టెల్లార్ బ్లాక్ అనే 3 కలర్ వేరియంట్లలో రావొచ్చు.
