LPG Gas eKYC : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి కొత్త రూల్.. వెంటనే ఇలా చేయండి..
LPG Gas eKYC : మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే, ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక నిబంధన తీసుకొచ్చింది.
LPG Gas Consumers Alert Complete eKYC by October 1
LPG Gas eKYC: మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే, ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక నిబంధన తీసుకొచ్చింది. అక్టోబర్ 1వ తేదీలోగా ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రాయితీ సిలిండర్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయగా.. ఇంకా చాలామంది మిగిలే ఉన్నారు. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? చేయకపోతే సిలిండర్ సరఫరా, సబ్సిడీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం.
Also Read : Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త.. సర్కార్ కీలక ప్రకటన..
వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతిఒక్కరూ వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్లను రాయితీపై పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకు మాత్రమే అక్టోబర్ నెల నుంచి ప్రభుత్వ రాయితీతో గ్యాస్ సిలిండర్ అందుతుంది. ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోని వారు వెంటనే (అక్టోబర్ 1వ తేదీలోపు) ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈకేవైసీ విధానం వల్ల అసలైన లబ్ధిదారులకు మాత్రమే రాయితీ సిలిండర్లు అందించే అవకాశం ఉంటుంది. నకిలీ కనెక్షన్ల తొలగింపునకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. వారికి రాయితీపై సిలిండర్ల పంపిణీని యథావిధిగా కొనసాగిస్తారు.
ఈకేవైసీ చేయించుకోని వారు వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద మొబైల్ యాప్ ద్వారా వేలిముద్ర, ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా చేయించుకోవచ్చు. లేదంటే గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. వినియోగదారులు ఇంటి నుంచి మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియను చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈకేవైసీ ప్రక్రియకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వెంటనే స్పందించి చేయించుకుంటే సిలిండర్ల సరఫరా జరుగుతుందని, లేకుంటే ఆపేస్తారని అధికారులు చెబుతున్నారు.
