Salaar: సలార్ ఏపీ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Salaar: సలార్ ఏపీ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలుసా?

Huge Demand For Salaar Rights In AP

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించడంతో ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Salaar : ఇటలీ మీడియాలో ‘సలార్’ గురించి న్యూస్.. ఏంటో తెలుసా?

కాగా, ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం పోస్టర్స్‌తోనే ఈ సినిమా భారీ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా షూటింగ్ ఇంకా ముగియకుండానే, ఈ చిత్ర హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్ర ఏపీ రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఏపీ రైట్స్‌కే ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్లు వస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Salaar : టీజర్ కూడా రిలీజ్ కాకముందే.. రికార్డు సృష్టించిన సలార్!

ఈ లెక్కన సలార్ చిత్ర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు పైగా అమ్ముడుకావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.