Salaar : టీజర్ కూడా రిలీజ్ కాకముందే.. రికార్డు సృష్టించిన సలార్!

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ బుక్ మై షో లో రికార్డు సృష్టించింది.

Salaar : టీజర్ కూడా రిలీజ్ కాకముందే.. రికార్డు సృష్టించిన సలార్!

Salaar created a record even before the release of the teaser

Salaar : ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకోవడం, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి సలార్ తెరకెక్కించడంతో.. ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ బుక్ మై షో లో రికార్డు సృష్టించింది.

Salaar: ‘సలార్’పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

ప్రముఖ థియేటర్ టిక్కెటింగ్ సైట్ బుక్ మై షో లో సలార్ సినిమా పై లక్షకు పైగా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఒక ట్రైలర్, టీజర్, ఆఖరికి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ కాకముందే ఈ మూవీ పై ఇంతమంది ఆసక్తి చూపించడం రికార్డు అంటున్నారు. ఈ ఘనత కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అంటూ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సలార్ లోని ఈ అమ్మడి క్యారెక్టర్ షూటింగ్ పూర్తి అయ్యింది.

ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి, మధు గురుస్వామి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.