Salaar: ‘సలార్’పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Salaar: ‘సలార్’పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Shruti Haasan: సలార్ షూటింగ్‌లో తిరిగి జాయన్ అయిన శ్రుతి హాసన్

ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆమె తాజాగా ముగించుకున్నట్లుగా పోస్ట్ చేసింది.

Shruti Haasan : ఒళ్ళంతా డార్క్ గా కప్పుకొని.. వెరైటీ చీరలో శృతి ఫోజులు..

ఈమేరకు ఆమె దర్శకుడు ప్రశాంత్ నీల్, కెమెరా మ్యాన్ భువన్ గౌడతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో వర్క్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె పేర్కొంది. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.