Shruti Haasan: సలార్ షూటింగ్‌లో తిరిగి జాయన్ అయిన శ్రుతి హాసన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తనదైన మార్క్ యాక్షన్‌తో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ఈ మూవీపై అంచనాలను ఓ రేంజ్‌లో సెట్ చేశాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Shruti Haasan: సలార్ షూటింగ్‌లో తిరిగి జాయన్ అయిన శ్రుతి హాసన్

Shruti Haasan Back To Salaar Shoot

Shruti Haasan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తనదైన మార్క్ యాక్షన్‌తో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ఈ మూవీపై అంచనాలను ఓ రేంజ్‌లో సెట్ చేశాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Shruti Haasan : తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన శృతిహాసన్..

అయితే ఈ బ్యూటీ ఇటీవల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కావడంతో, ఆయా సినిమాల ప్రమోషన్స్ కోసం సలార్ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ శ్రుతి హాసన్ సలార్ చిత్ర షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయ్యింది. ఈ మేరకు అమ్మడు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రఫర్ భువన్ గౌడలతో కలిసి దిగిన ఫోటోను శ్రుతి తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Shruti Haasan: సీనియర్ హీరోలతో శ్రుతి రొమాన్స్.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన బ్యూటీ!

తాను తిరిగి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించిందని ఆమె పేర్కొంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఆద్య అనే పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హొంబాలే ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.