Shruti Haasan: సీనియర్ హీరోలతో శ్రుతి రొమాన్స్.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన బ్యూటీ!

అందాల భామ శ్రుతి హాసన్‌కు సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె తమిళ్, తెలుగులో దాదాపు అందరూ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఇక తాజాగా అమ్మడు సంక్రాంతి బరిలో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాల్లో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండటం విశేషం. దీంతో ఈ సంక్రాంతి శ్రుతికే సొంతం అని అభిమానులు అంటున్నారు.

Shruti Haasan: సీనియర్ హీరోలతో శ్రుతి రొమాన్స్.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన బ్యూటీ!

Shuti Haasan Fires On Trollers For Romancing Senior Heroes

Shruti Haasan: అందాల భామ శ్రుతి హాసన్‌కు సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె తమిళ్, తెలుగులో దాదాపు అందరూ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఇక తాజాగా అమ్మడు సంక్రాంతి బరిలో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాల్లో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండటం విశేషం. దీంతో ఈ సంక్రాంతి శ్రుతికే సొంతం అని అభిమానులు అంటున్నారు.

Shruti Haasan : బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై స్పందించిన శ్రుతిహాసన్.. ఆన్‌లైన్‌లో ద్వేషం బాగా పెరిగిపోయింది..

అయితే కొందరు నెటిజన్లు మాత్రం శ్రుతి హాసన్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసం తండ్రి వయసున్నవారితో రొమాన్స్ చేస్తావా అంటూ శ్రుతిని నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన శ్రుతి హాసన్.. ఆ ట్రోలర్స్‌కు తనదైన పద్ధతిలో సమాధానం ఇచ్చింది. సినిమాల్లో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని.. ప్రతిభ ఉన్నవారు తాము చనిపోయేంత వరకు నటిస్తూనే ఉంటారు.. తానేమీ వారికి అతీతం కాదంటూ శ్రుతి హాసన్ ట్రోలర్స్‌కు గట్టి రెస్పాన్స్ ఇచ్చేసింది.

Shruti Haasan : ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తా అనుకోలేదు.. 13 ఏళ్ళు అప్పుడే అయిపోయాయి..

ఇక ఈ సంక్రాంతి బరిలో ఆమె నటిస్తున్న రెండు సినిమాలు కూడా విజయాన్ని అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు తన నెక్ట్స్ మూవీగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇలా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుల్లో నటిస్తూ శ్రుతి హాసన్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.