Shruti Haasan : బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై స్పందించిన శ్రుతిహాసన్.. ఆన్‌లైన్‌లో ద్వేషం బాగా పెరిగిపోయింది..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ బాయ్‌కాట్‌ అనేది ఒక్క సినిమాకి సంబంధించినది కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దీనిపై..................

Shruti Haasan : బాయ్‌కాట్‌ బాలీవుడ్ పై స్పందించిన శ్రుతిహాసన్.. ఆన్‌లైన్‌లో ద్వేషం బాగా పెరిగిపోయింది..

Shruti Haasan comments on Boycott Bollywood

Shruti Haasan :  ఇటీవల కొంతమంది నెటిజన్లు బాలీవుడ్ సినిమాలని బాయ్‌కాట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోని చాలా సినిమాలు ఈ బాయ్‌కాట్‌ బారిన పడ్డాయి. బాయ్‌కాట్‌ బాలీవుడ్ వల్ల భారీగానే నష్టం చేకూరింది అక్కడి సినిమాలకి. ఇప్పటికే దీనిపై చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు మాట్లాడారు. కొంతమంది దీనిపై సీరియస్ అయ్యారు కూడా. నెటిజన్లు మాత్రం వదలకుండా ఏకంగా బాయ్‌కాట్‌ బాలీవుడ్ అని ట్రెండ్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికి ఈ ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాని కూడా బాయ్‌కాట్‌ అంటూ ట్రెండ్ చేశారు. ఎన్ని రోజులు గడుస్తున్నా ఈ బాయ్‌కాట్‌ బాలీవుడ్ మాత్రం ఆగట్లేదు. తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్ దీనిపై మాట్లాడింది.

BiggBoss 6 Day 61 : బిగ్‌బాస్‌‌లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ బాయ్‌కాట్‌ అనేది ఒక్క సినిమాకి సంబంధించినది కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దీనిపై అందరూ ఆలోచించాలి. సినిమాలని బాయ్‌కాట్‌ చేయడమనేది మంచి పద్ధతి కాదు. ఇది సినిమాల మీద దాడి లాంటిదే. ఇది కేవలం సినీ పరిశ్రమలోనే ఎక్కువగా బాలీవుడ్ లోనే చూస్తున్నాం. ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ ద్వేషం బాగా పెరిగిపోయింది. దీనిని తగ్గించాల్సిన అవసరం ఉంది” అని తెలిపింది.