Shruti Haasan : తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన శృతిహాసన్..

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటించిన తాజా చిత్రాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా ఇటీవల ఈ అమ్మడు అనారోగ్యానికి గురి అయిన విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఆమె ఆరోగ్యంపై పలు వెబ్ సైట్ లో అనేక కథనాలు వస్తున్నాయి. నేడు వాటిపై ఘాటుగా స్పంధించింది శృతిహాసన్.

Shruti Haasan : తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన శృతిహాసన్..

Shruti Haasan made a full stop about his health rumours

Updated On : January 13, 2023 / 1:55 PM IST

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటించిన తాజా చిత్రాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా ఇటీవల ఈ అమ్మడు అనారోగ్యానికి గురి అయిన విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయిన శృతి వైరల్ ఫీవర్ భారిన పడింది. దాని వల్ల వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయింది. అయితే ఆమె ఆరోగ్యంపై పలు వెబ్ సైట్ లో అనేక కథనాలు వస్తున్నాయి. నేడు వాటిపై ఘాటుగా స్పంధించింది శృతిహాసన్.

Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..

‘నాకు వచ్చింది వైరల్ ఫీవర్ అంతే. కానీ దానిని కొందరు మరో విధంగా చిత్రీకరిస్తూ రాస్తున్నారు. నా మెంటల్ హెల్త్ బాగోలేదని, అరుదైన మానసిక రోగంతో బాధపడుతున్నట్లు రాస్తున్నారు. నా ఆరోగ్యం, మెంటల్ హెల్త్ బాగానే ఉంది. మీరు ఇలా రాయడం వల్ల నిజంగా బాధ పడుతున్న కొంతమంది.. వాళ్ళ సమస్యని బయటకి చెప్పనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీకు ఇటువంటి జబ్బు ఏమన్నా ఉంటే త్వరగా చికిత్స తీసుకోండి. అంతేగాని ఇలా పిచ్చిపిచ్చిగా రాయకండి’ అంటూ మండిపడింది.

Veera Simha Reddy Review : బాలయ్య మార్క్ సినిమా.. యాక్షన్ ఎలేవేషన్‌లో బోయపాటిని మించిన గోపీచంద్..

కాగా శృతిహాసన్ నటించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ మొదటి షో తోనే హిట్టు టాక్ ని సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలోనో తన పాత్ర కొద్దీ న్యాయం చేసిన శృతి.. డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు నటిస్తున్న మరో చిత్రం ప్రభాస్ ‘సలార్’. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరులో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ దాదాపు నెల పాటు జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో శృతిహాసన్ కూడా పాల్గొనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా దసరాకి విడుదలయ్యే అవకాశం ఉంది.