Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..

 చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయింది........

Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..

Chiranjeevi Waltair Veerayya movie Review

Waltair Veerayya Review :  చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయింది. ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఇక పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. నేడు సినిమా రిలీజ్ తో చిరు అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.

ఇక కథ విషయానికి వస్తే.. ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ (బాబీ సింహా)ని అనుకోకుండా ఒక పల్లెటూరి స్టేషన్ లో ఒక రాత్రి ఉంచాల్సి వస్తుంది. ఆ క్రిమినల్ తన మనుషులతో కలిసి ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరని చంపేసి తప్పించుకుంటాడు. దీంతో ఆ స్టేషన్ హెడ్ జాబ్ పోవడం, తన తోటి పోలీసులని చంపేశాడన్న కోపంతో జాబ్ పోయినా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఓ పోలీసు(రాజేంద్రప్రసాద్) లోకల్ రౌడీ అయిన వాల్తేరు వీరయ్య(చిరంజీవి) సహాయం కోసం వస్తాడు. డబ్బులకోసం చిరంజీవి ఈ పనిని ఒప్పుకొని అతన్ని పట్టుకోవడానికి మలేషియా వెళ్తారు. ఇక అక్కడి నుండి కథ మొదలవుతుంది. మలేషియాలో శృతి హాసన్ తగలడం, శృతి తో చిరు రొమాన్స్, పక్కన ఉన్న కమెడియన్స్ కామెడీతో సాగిపోతుంటే శృతి హాసన్ ఓ ట్విస్ట్ ఇస్తుంది. ఇక బాబీ సింహానే వీళ్ళని పట్టుకుంటాడు. అప్పుడు ట్రైలర్ లో చూపించిన డైలాగ్.. మీ కథలోకి నేను రాలేదు, నా కథలోకి మీరు వచ్చారు అని ఓ ట్విస్ట్ ఇచ్చి బాబీ సింహాని చిరంజీవి చంపేస్తాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ కి మంచి ఊపు ఇచ్చి వదిలేస్తాడు డైరెక్టర్.

ఇక ఇంటర్వెల్ నుంచి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చిరు. ఇంటర్వెల్ నుంచి రవితేజ ఎంట్రీతో ఓపెనింగ్ చేస్తాడు. వైజాగ్ లో సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్లకి లీడర్ అయిన వాల్తేరు వీరయ్య, అతని చుట్టూ ఉండే బ్యాచ్ కామెడీ, రవితేజ పోలీస్ కావడంతో అతనితో గొడవలు, చిరంజీవి కామెడీ ఫుల్ గా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి చిరంజీవిని మోసం చేస్తూ ఓ పని చేస్తుండగా కొంతమంది పిల్లలు చనిపోతే ఆ నేరం చిరు మీద పడితే అప్పుడు ఏం జరిగింది? చిరంజీవి జైలు నుంచి ఎలా బయటకి వచ్చాడు? రవితేజకి, చిరంజీవి మధ్య ఉన్న సంబంధం ఏంటి? క్యాథరీన్ చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చిరంజీవి ఎందుకు మలేషియా వెళ్ళాడు? మోసం చేసిన వ్యక్తి (విలన్)ని పట్టుకున్నాడా? చిరంజీవి అనుకున్నది నెరవేర్చాడా? తన తమ్ముడు ఎవరు ? అతనికి ఏం మాట ఇచ్చాడు? ఆ మాట నెరవేర్చాడా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా మొదటి నుంచి కూడా ఒకప్పటి చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చాడు దర్శకుడు. ఇక చిరు, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. వాళ్ళ ఫైట్స్, కామెడీ, డైలాగ్స్ అన్నీ బాగా రాసుకున్నారు. రాజేంద్రప్రసాద్ తో మొదలైన ఈ కథ మధ్యలో ట్విస్టులతో బాగానే సాగుతుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అదిరిపోతుంది. శృతి హాసన్ తో చిరు ఫైట్ బాగుంటుంది. జంబలకడి జారు మిఠాయి.. లాంటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సాంగ్స్, కోపదారి మనిషి లాంటి డైలాగ్స్ బాగానే వాడుకున్నారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో చిరు, రవితేజ ఏడిపిస్తారు కూడా. దర్శకుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ కావడం, రవితేజ తనకి లైఫ్ ఇవ్వడంతో త ఇద్దరి హీరోల్ని చాలా చక్కగా డీల్ చేశాడు. ఇద్దరికీ మంచి ఎలివేషన్స్ ఇవ్వడంతో థియేటర్స్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతున్నాయి. సాంగ్స్ కి స్క్రీన్ స్పేస్ కరెక్ట్ గా సరిపోవడంతో థియేటర్స్ లో పాటలు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక సాంగ్ అక్కర్లేకపోయినా పెట్టినట్టు ఉంటుంది. క్యాథరీన్ కూడా మంచి పాత్రలో మెప్పించింది.

Karthi : ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న హీరో కార్తీ..

మొత్తానికి పండక్కి చాలా రోజుల తర్వాత చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్, కామెడీ, యాక్షన్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తున్నాడు. గత పండగ దసరాకి గాడ్ ఫాదర్ లో సైలెంట్ మాస్ ఎలివేషన్స్ తో వచ్చి హిట్ కొట్టి ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తురావడం ఖాయం.