Veera Simha Reddy Review : బాలయ్య మార్క్ సినిమా.. యాక్షన్ ఎలేవేషన్‌లో బోయపాటిని మించిన గోపీచంద్..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సినిమా విడుదలతో నేడు థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలు పడడంతో నందమూరి అభిమానులు అర్ధరాత్రి నుంచే మాస్ జాతర మొదలు పెట్టారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే..

Veera Simha Reddy Review : బాలయ్య మార్క్ సినిమా.. యాక్షన్ ఎలేవేషన్‌లో బోయపాటిని మించిన గోపీచంద్..

Veera Simha Reddy Movie Review

Veera Simha Reddy Review : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. బాలయ్య ఫాదర్ అండ్ సన్ పాత్రలు పోషించగా, తనకి జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటించాడు. క్రాక్ తరువాత మరోసారి అలాంటి నెగటివ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.

Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’లో పేలిన పొలిటికల్ డైలాగ్స్.. కట్టడం అభివృద్ధి, కూల్చాటం కాదు!

సినిమా విడుదలతో నేడు థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలు పడడంతో నందమూరి అభిమానులు అర్ధరాత్రి నుంచే మాస్ జాతర మొదలు పెట్టారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. టర్కీలో కథ మొదలవుతుంది. తనకి ఒక తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలియకుండా బాలకృష్ణని పెంచుతుంది హనీ రోజ్. ఇక అక్కడే పరిచయమైన శృతిహాసన్ తో బాలకృష్ణ ప్రేమలో పడతాడు. వారిద్దరికీ పెళ్లి చేయవలసి వచ్చిన సమయంలో తనకి ఒక తండ్రి ఉన్న నిజాన్ని బయటపెడుతోంది హనీ రోజ్.

దీంతో కొడుకు పెళ్లి గురించి మాట్లాడానికి రావాలంటూ హనీ రోజ్, వీరసింహారెడ్డిని కోరడంతో, టర్కీ బయలుదేరుతాడు. ఇక వీరసింహారెడ్డిని చంపడానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శత్రువులు టర్కీ వచ్చి వీరసింహారెడ్డిని చంపేస్తారు. అక్కడితో ఇంటర్వెల్ అవుతుంది. ఇక అక్కడ నుంచి కొడుకు బాలకృష్ణ రాయలసీమ రావడం, తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడం మిగతా కథ. కాగా సెకండ్ హాఫ్ లో రెండు, మూడు ట్విస్ట్ లు ఉన్నాయి. సినిమా మొత్తంలో యాక్షన్ సీన్స్ హైలైట్. నిజం చెప్పాలి అంటే బోయపాటి తరువాత బాలయ్యని మళ్ళీ ఆ రేంజ్ లో ఎలివేట్ చేసింది మలినేని గోపీచంద్. కథలో కేవలం యాక్షన్, ఫ్యాక్షన్ మాత్రమే కాదు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. దర్శకుడు యాక్షన్ సీన్స్ తో ఎంత హై ఫీల్ ఇచ్చాడో, ఎమోషన్స్ తో అంత ఏడిపించాడు.

మలయాళ నటి హనీ రోజ్.. బాలకృష్ణకి తల్లిగా, మరదలిగా రెండు డిఫరెంట్ రోల్స్ లో బాగా నటించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పాత్రలు గురించి మాట్లాడుకోవాలి అంటే విలన్ రోల్ చేసిన దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన నటనతో అలరించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. అఖండ సినిమాకి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్ అయ్యిందో, ఈ సినిమాకి కూడా అంతే ప్లస్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బ్రహ్మానందం.. ఈ సినిమా మొదటిలో ఒక చిన్న పాత్రతో కనిపిస్తాడు.

చివరిగా బాలయ్య గురించి.. ఎప్పటి లాగానే తన డైలాగ్స్ , యాక్షన్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా సినిమాలో బాలయ్య చెప్పే పొలిటికల్ డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. దాదాపు 10కి పైగా పొలిటికల్ సైటర్లు ఉన్నాయి సినిమాలో. కొన్ని ఇన్‌డైరెక్ట్ గా వేసినా, కొన్ని మాత్రం జగన్ ప్రభుత్వానికి సూటిగా తగిలేలా ఉంటాయి. ఏదేమైనా వీరసింహారెడ్డి ప్యూర్ బాలయ్య మార్క్ సినిమా. అయితే జనరల్ ఆడియన్స్ కి ఇది యావరేజ్ అనిపించ వచ్చు.