Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’లో పేలిన పొలిటికల్ డైలాగ్స్.. కట్టడం అభివృద్ధి, కూల్చటం కాదు!

నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే పలు చోట్ల ఈ మూవీ బెన్ఫిట్ షోలు పడిపోయిని. ఇక ఈ మార్నింగ్ షోస్ చూసిన అభిమానులు సినిమాలోని కొన్ని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో పొలిటికల్ డైలాగ్స్ పేల్చిన బాలయ్య.. మూవీలో మరిన్ని పొలిటికల్ సైటర్లు వేసినట్లు తెలుస్తుంది.

Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’లో పేలిన పొలిటికల్ డైలాగ్స్.. కట్టడం అభివృద్ధి, కూల్చటం కాదు!

balayya political dialogues in Veera Simha Reddy movie

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే పలు చోట్ల ఈ మూవీ బెన్ఫిట్ షోలు పడిపోయిని. దీంతో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం మొదలైంది. ఇక ఈ మార్నింగ్ షోస్ చూసిన అభిమానులు సినిమాలోని కొన్ని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో పొలిటికల్ డైలాగ్స్ పేల్చిన బాలయ్య.. మూవీలో మరిన్ని పొలిటికల్ సైటర్లు వేసినట్లు తెలుస్తుంది.

Veera Simha Reddy : ఆ సినిమా చేయాలని నా జీవిత ఆశయం.. బాలకృష్ణ!

సంతకాలు పెడితే ‘బోర్డ్ మీద పేరు మారుతుందోమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అంటూ ట్రైలర్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన బాలయ్య.. మూవీలో మరో సంచలన డైలాగు వేశాడు. ‘జీతాలు ఇవ్వటం అభివృద్ధి. బిచ్చమేయటం అభివృద్ధి కాదు. పరిశ్రమ తేవటం అభివృద్ధి, మూయటం అభివృద్ధి కాదు. కట్టడం అభివృద్ధి, కూల్చటం అభివృద్ధి కాదు’ అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి పవర్ ఫుల్ పంచ్ ఇచ్చాడు. మరి దీనిపై ఏపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు. హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది అంటున్నారు అభిమానులు. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.