Naga Chaitanya-Samantha: భరించలేని బాధ.. ఆ నొప్పేంటో తనకు తెలుసన్న ప్రకాష్ రాజ్!

పదేళ్లు ప్రేమించుకొని ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని.. ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేమని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి ఇరు మతాల సాక్షిగా ఒక్కటైన జంట నాగచైతన్య-సమంత.

Naga Chaitanya-Samantha: భరించలేని బాధ.. ఆ నొప్పేంటో తనకు తెలుసన్న ప్రకాష్ రాజ్!

Naga Chaitanya Samantha (1)

Naga Chaitanya-Samantha: పదేళ్లు ప్రేమించుకొని ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని.. ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేమని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి ఇరు మతాల సాక్షిగా ఒక్కటైన జంట నాగచైతన్య-సమంత. పెళ్లి నాటి నుండే టాలీవుడ్ యంగ్ కపుల్స్ లో స్వీట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంటపై ఏ కళ్ళు పడ్డాయో కానీ కొన్నాళ్ల క్రితం నుండే పొరపొచ్చలు మొదలయ్యాయి. అప్పుడే ఇది లీకవడంతో మీడియా, సోషల్ మీడియా నుండి పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి.

Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్‌!

మొత్తానికి ఈ బంధాన్ని ఆ జంట తెంచేసుకుంది. ఇద్దరూ ఒక్కటిగానే కటీఫ్ చెప్పేసుకోగా కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు ద్వేషాన్ని చూపిస్తున్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ జంట విడాకులపై బాధను వ్యక్తం చేశారు. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించానన్న ప్రకాష్ రాజ్ ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసనీ.. అది భరించలేని నొప్పిగా ఉంటుందని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. కానీ ఇది వారి వ్యక్తిగత విషయం. తమ నిర్ణయాన్ని గౌరవించండి అని అభ్యర్థించారు. నాక్కూడా గతంలో ఒకసారి విడాకులయ్యాయి. కాబట్టి ఆ బాధేంటో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఒక్కటై, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి. అయినా వాళ్లు.. వేరేదారి లేక ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇది వారి పర్సనల్‌ విషయం’ అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్‌.