Icon Star Allu Arjun: లైన్‌లో మరో రెండు సినిమాలు.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

ఇప్పుడు మన తెలుగు హీరోలు వరసపెట్టి సినిమాలు చేసేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారు. నేషనల్ వైడ్ మన హీరోలకు మార్కెట్ పెరగడంతో వరసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.

Icon Star Allu Arjun: లైన్‌లో మరో రెండు సినిమాలు.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

Icon Star Allu Arjun

Icon Star Allu Arjun: ఇప్పుడు మన తెలుగు హీరోలు వరసపెట్టి సినిమాలు చేసేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారు. నేషనల్ వైడ్ మన హీరోలకు మార్కెట్ పెరగడంతో వరసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వీరిలో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ బాబు బాగా బిజీగా మారిపోయాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయంలో తగ్గేదే లే అంటన్నాడు. రాబోయే రెండు సంవత్సరాలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో పుల్ బిజీ అయిపోతున్నాడు బన్నీ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో, నాన్ స్టాప్ షూట్స్ తో ఫుల్ ఎంగేజ్ అయిపోతున్నాడు.

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

రెండేళ్ల నుంచి తెరకెక్కుతున్న పుష్ప అయిపోయాక రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇప్పటికే లేట్ అయిన ఐకాన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఐకాన్ అయ్యాకైనా.. రెస్ట్ తీసుకుంటాడేమో అనుకుంటే.. సారీ బాస్ అంటూ.. బోయపాటి సినిమాకి షిఫ్ట్ అవుతున్నాడు. ప్రజెంట్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పుష్ప తర్వాత వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టి ఫుల్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు బన్నీ.

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

అక్టోబర్ నాటికి పుష్ప షూట్ కంప్లీట్ చేస్కోడానికి ప్లాన్ చేసుకుంది సుకుమార్ అండ్ టీమ్. ఫస్ట్ పార్ట్ కి సంబందించి షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నవంబర్ లోనే ఐకాన్ షూట్ లో జాయిన్ అవుతున్నాడు బన్నీ. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఆగిపోయిన ఐకాన్ ని సూపర్ ఫాస్ట్ గా రెడీ చెయ్యడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తుంది.

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

ఇక, ఐకాన్ సినిమా ఇంకా కొలిక్కి రాకుండానే బోయపాటితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. బోయపాటితో సరైనోడు చేసిన బన్నీ.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరో పవర్ ప్యాక్డ్ మూవీ చెయ్యడానికి ఆల్రెడీ బోయపాటికి డేట్స్ కూడా ఇచ్చాడని టాలీవుడ్ లో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబందించి షూటింగ్ నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఉంటుందని, ఐకాన్, బోయపాటి మూవీ సైమల్టేనియస్ గా షూట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట.