Radheshyam : ఇవి కొంటే ప్రభాస్‌ని కలిసి అవకాశం..

'రాధేశ్యామ్' సినిమాకు సంబంధించిన NFTని మార్చ్ 8న లాంఛింగ్ చేయనున్నారు. ఈ NFT కలెక్షన్లలో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌, రాధేశ్యామ్ ఎక్స్‌క్లూజివ్ 3డి....

Radheshyam : ఇవి కొంటే ప్రభాస్‌ని కలిసి అవకాశం..

Radheshyam

 

Radheshyam :   పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉండగా ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోసారి సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు NFT పేరుతో తమ డిజిటల్ కలెక్షన్ ని కూడా సేల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా కూడా NFT తో మరింత సంపాదించాలని, అభిమానులకి మరింత దగ్గరవ్వాలని సరికొత్త ప్లాన్ వేసింది.

 

‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించిన NFTని మార్చ్ 8న లాంఛింగ్ చేయనున్నారు. ఈ NFT కలెక్షన్లలో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌, రాధేశ్యామ్ ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ తో పాటు సినిమాలో ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వాటిని కొనుక్కోడానికి అభిమానులకు మార్చ్ 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Director Bala : ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యతో విడిపోయిన స్టార్ డైరెక్టర్

అయితే ఈ డిజిటల్ కలెక్షన్‌లను కొనుక్కున్న వారిలో డ్రా తీసి 100 మంది లక్కీ విన్నర్స్ ని ఎంపిక చేయనున్నారు. ఈ 100 మంది లక్కీ విన్నర్స్ కి ప్రభాస్‌ను కలిసే అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ రకంగా సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సినిమా కోసం అభిమానులే కాక దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.