Indian Bride: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఎగ్జామ్.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైన నవ వధువు.. వైరల్ అవుతున్న వీడియో

చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్‌కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Indian Bride: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఎగ్జామ్.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైన నవ వధువు.. వైరల్ అవుతున్న వీడియో

Indian Bride: ఒకే రోజు పెళ్లి.. అదే రోజు పరీక్ష వస్తే… రెండింటిలో దేన్నీ వదులుకోలేని పరిస్థితి ఎవరిదైనా. ఒకదాని కోసం ఇంకోటి వాయిదా వేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే పెళ్లి ఎంత ముఖ్యమో.. కెరీర్లో మంచి స్థానానికి ఎదిగేందుకు పరీక్షలు కూడా అంతే ముఖ్యం.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

అందుకే చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్‌కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరవ్వడం ద్వారా ఆ మహిళ చదువుకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని అందరూ అభినందిస్తున్నారు. కేరళకు చెందిన శ్రీ లక్ష్మీ అనిల్ అనే మహిళ, బెథాని నవజీవన్ కాలేజ్‌లో ఫిజియోథెరపీ చదువుతోంది. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లి రోజే ఆమెకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది.

WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

దీంతో తన కుటుంబ సభ్యులు, వరుడి సహకారంతో పెళ్లి రోజే పరీక్షకు హాజరైంది. అది కూడా పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్న దుస్తుల్లోనే వెళ్లి, పరీక్షకు హాజరైంది. పరీక్షలో అందరు విద్యార్థుల్లాగే తన ఎప్రాన్ ధరించింది. పరీక్షకు హాజరైన శ్రీలక్ష్మికి తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. పరీక్ష అనంతరం బయటకు రాగానే తన తల్లిని హత్తుకుంది. తిరిగి పెళ్లి మండపానికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by ????_????? (@_grus_girls_)