Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

అలోక్ అనే పదిహేనేళ్ల బాలుడు తల్లితోపాటు, ఆమె పని చేసే ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్‌లో బాలుడు ఎలివేటర్ దగ్గర పని చేస్తున్నాడు. రెండో ఫ్లోర్‌లో పని చేస్తుండగా పొరపాటున ఎలివేటర్ షాఫ్ట్‌లో పడిపోయాడు. లోపలి వైర్లలో చిక్కుకుపోయాడు.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఎలివేటర్ పక్కన పని చేస్తున్న బాలుడు పొరపాటున అందులో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని, బవానా పారిశ్రామిక వాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలోక్ అనే పదిహేనేళ్ల బాలుడు తల్లితోపాటు, ఆమె పని చేసే ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్‌లో బాలుడు ఎలివేటర్ దగ్గర పని చేస్తున్నాడు. రెండో ఫ్లోర్‌లో పని చేస్తుండగా పొరపాటున ఎలివేటర్ షాఫ్ట్‌లో పడిపోయాడు. లోపలి వైర్లలో చిక్కుకుపోయాడు. అదే సమయంలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక వ్యక్తి ఎలివేటర్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కు వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఎలివేటర్ కింది నుంచి పైకి వెళ్లింది. పైన చిక్కుకున్న అలోక్‌‌పైకి ఎలివేటర్ దూసుకురావడంతో అలోక్ శరీరం నలిగిపోయింది. అప్పటికే అతడికి లోపలి వైర్ల ద్వారా కరెంట్ షాక్ తగిలింది.

Earthquake In Sikkim : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

ఇటు కరెంట్ షాక్ తగలడం, అటు ఎలివేటర్ ద్వారా శరీరం నలిగిపోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది అతడ్ని రక్షించి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అలోక్ ప్రాణాలు కోల్పోయాడు. అలోక్ మృతిపై ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఆమె ఆరోపించింది. తన కుమారుడు ఫ్యాక్టరీకి ఆడుకునేందుకు వచ్చాడని, కానీ యాజమాన్యం అతడితో పని చేయించుకుందని, పని చేస్తుండగా తన కుమారుడు మరణించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిజంగానే యాజమాన్యం బాలుడితో పని చేయించుకుందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.