Earthquake In Sikkim : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

సిక్కింలో భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి13,2023) తెల్లవారుజామున 4:15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయింది.

Earthquake In Sikkim : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

earthquake

Earthquake In Sikkim : దేశంలో వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి13,2023) తెల్లవారుజామున 4:15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయింది. యుక్సోమ్ కు 70 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది.

భూ కంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఆదివారం (ఫిబ్రవరి 12,2023) మధ్యాహ్నం అసోంలోని నాగౌన్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. సాయంత్రం 4:18 గంటలకు నాగావ్ పరిధిలోని భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది.

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

అలాగే గుజరాజ్ లోని సూరత్ జిల్లాలో భూకంపం సంభవించింది. హజిరా జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో 5.2 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకపం తీవ్రత 3.8గా నమోదు అయింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. మరోవైపు భారీ భూకంపం టర్కీ, సిరియాను అతలాకుతలం చేసింది.

వందల సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. టర్కీ, సిరియాలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.