Pushpa Movie : జడేజా, బన్నీని బాగా ప్రమోట్ చేస్తున్నాడుగా..

యంగ్ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా.. అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ లుక్‌లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు..

Pushpa Movie : జడేజా, బన్నీని బాగా ప్రమోట్ చేస్తున్నాడుగా..

Ravindra Jadeja

Pushpa Movie: ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఏ చిన్న వార్త అయినా సరే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందులోనూ డైలాగ్స్, సాంగ్స్ వాటికి నెటిజన్లు చేసే రీల్స్.. దాని ద్వారా వాళ్లకొచ్చే ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

అదే సెలబ్రెటీలను సెలబ్రిటీలే ప్రమోట్ చేస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గతకొద్ది కాలంగా తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు రీల్స్ చేసి అదరగొట్టారు. ‘అల..వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు డేవిడ్ భార్యతో పాటు చిందులేస్తే ఆ వీడియో బాగా సెన్సేషన్ అయ్యింది.

Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!

చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు రీల్స్ చేశారు. డేవిడ్ ‘పుష్ప’ రీల్ కూడా చేస్తే బాగా వైరల్ అయింది. ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నందుకు డైరెక్టర్ వెంకీ కుడుముల స్టేజ్ మీద డేవిడ్ వార్నర్‌కి థ్యాంక్స్ కూడా చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja)

ఇదిలాఉంటే.. ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’ అంటూ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అచ్చు అల్లు అర్జున్‌ మాదిరిగానే ‘పుష్ప రాజ్’ లా తయారయ్యి, నోట్లో బీడీ పెట్టుకుని డైలాగ్‌తో జడేజా షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకుముందు ‘పుష్ప’ లో ‘తగ్గేదే లే’  డైలాగ్ చెప్పిన జడేజా ఇప్పుడు ఏకంగా ‘పుష్ప రాజ్’ గెటప్‌లోకి మారిపోయాడు. అంతేకాదు, జడేజా ‘పుష్ప రాజ్’ గెటప్‌లో ఉన్న పిక్‌నే తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడం విశేషం.