Korean Movies : ఇండియన్ సినిమా కొరియన్ లో రీమేక్.. ఇన్నాళ్లు కొరియన్ సినిమాలు ఇక్కడ.. కానీ ఇప్పుడు..
ఇన్నాళ్లు కొరియన్ సినిమాలు చూసి సంబరపడిపోయి, కొరియన్ సినిమాలు మనం రీమేక్ చేస్తుంటే ఇప్పుడు కొరియన్స్ మన సినిమాను రీమేక్ చేయబోతున్నారు.
Drishyam : గత కొంతకాలంగా కొరియన్ సినిమాలు(Korean Movies) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరియన్స్ తీసే థ్రిల్లర్ సినిమాలు, లవ్(Love) జోనర్ సినిమాలు. ఈ రెండూ జోనర్ కొరియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కొరియన్ సినిమాలకు ఆడియన్స్ పెరుగుతున్నారు. చాలా ఓటీటీలలో కొరియన్ సినిమాలు దొరుకుతున్నాయి. కొంతమంది మన ఇండియన్ లోకల్ భాషల్లో కొరియన్ సినిమాలని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఐతే పలు కొరియన్ సినిమాల రీమేక్(Remake) రైట్స్ తీసుకొని ఇక్కడ ఇండియాలో నిర్మిస్తున్నారు. మన తెలుగులో ఓ బేబీ, శాకిని డాకిని.. లాంటి పలు సినిమాలు కొరియన్ రీమేక్స్.
ఇన్నాళ్లు కొరియన్ సినిమాలు చూసి సంబరపడిపోయి, కొరియన్ సినిమాలు మనం రీమేక్ చేస్తుంటే ఇప్పుడు కొరియన్స్ మన సినిమాను రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా జంటగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమా దృశ్యం. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయి అనంతరం తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయింది. అన్ని చోట్ల ఈ సినిమా భారీ విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 సినిమా కూడా అన్ని భాషల్లో రీమేక్ అయి మంచి విజయం సాధించింది. దృశ్యం 3 కూడా ఉంటుందని డైరెక్టర్ గతంలోనే ప్రకటించారు.
Raj – Koti : కొన్నేళ్ల క్రితం విడిపోయిన రాజ్ – కోటి.. చివరిసారిగా ఇటీవలే కలిసి..
ఇప్పుడు దృశ్యం సినిమా కొరియన్ లో రీమేక్ కాబోతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్, కొరియన్ నిర్మాణ సంస్థ ఆంథాలజీ స్టూడియోస్ కలిసి కొరియన్ లో దృశ్యం సినిమాను రీమేక్ చేయబోతున్నారు. అధికారికంగా ఇదే కొరియన్ లో రీమేక్ అయ్యే మొదటి ఇండియన్ సినిమా. మరి థ్రిల్లర్స్ సినిమాలు ఎక్కువగా చూసే కొరియన్స్ కి ఈ దృశ్యం సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా రీమేక్ ని అధికారికంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కొరియన్, ఇండియన్ నిర్మాణ సంస్థలు కలిసి ప్రకటించాయి. అక్కడ పారసైట్ యాక్టర్ సాంగ్కాంగ్హోం మెయిన్ లీడ్ లో కిమ్జీఊన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.
BIGGG NEWS… ‘DRISHYAM’ TO BE REMADE IN KOREAN LANGUAGE: PANORAMA STUDIOS – ANTHOLOGY STUDIOS MAKE OFFICIAL ANNOUNCEMENT AT CANNES… #KumarMangatPathak’s #PanoramaStudios and #AnthologyStudios announce a partnership for the remake of #Drishyam franchise in #Korea.
The official… pic.twitter.com/1kw8eRaAN6
— taran adarsh (@taran_adarsh) May 21, 2023