Air Pollution: వాయు కాలుష్యంతో ఐదేళ్ల ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు

ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది.

Air Pollution: దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తోంది. తాజా సర్వే ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుష్షు సగటున ఐదేళ్లు తగ్గుతోందట. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆయుర్దాయం సగటున 2.2 సంవత్సరాలు తగ్గేందుకు వాయు కాలుష్యం కారణమవుతోంది. ఆల్కహాల్ తీసుకోవడం, లేదా కలుషిత నీళ్లు తాగడం వల్ల కలిగే మరణాలకంటే వాయు కాలుష్యం వల్ల కలిగే మరణాలు మూడు రెట్లు ఎక్కువ.

PUBG: పబ్‌జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్‌సీపీసీఆర్ లేఖ

ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్నది దక్షిణాసియాలోనే. ఈ ప్రాంతంలోని సగం మందికిపైగా ప్రజలు వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 44 శాతం వాయు కాలుష్యం పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే కచ్చితంగా ప్రజల ఆయుష్షు ఐదేళ్లు తగ్గుతుంది. మన దేశంలో 1998 నుంచి 61.4 శాతం వాయు కాలుష్యం పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న రెండో దేశంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు కాలుష్య గణాంకాల ప్రకారం మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది. అత్యధిక కాలుష్యం ఉన్న రాష్ట్రం ఢిల్లీ కాగా ఆ తరువాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, బిహార్, హరియాణా, త్రిపుర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు