PUBG: పబ్‌జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్‌సీపీసీఆర్ లేఖ How is PUBG still available in India: NCPCR asks IT ministry

PUBG: పబ్‌జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్‌సీపీసీఆర్ లేఖ

దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్‌జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.

PUBG: పబ్‌జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్‌సీపీసీఆర్ లేఖ

PUBG: దేశంలో ఎప్పుడో నిషేధం విధించిన పబ్‌జి ఇటీవలి కాలంలో మళ్లీ వార్తల్లోకెక్కింది. కారణం.. పబ్‌జి వల్ల అనేక నేరాలు జరగడమే. ఇటీవల ఒక బాలుడు పబ్‌జిలో ఓడిపోయాడని స్నేహితులు హేళన చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. మరోచోట ఒక బాలుడు పబ్‌జి ఆడనివ్వడం లేదని తల్లినే కాల్చి చంపాడు.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పబ్‌జి కారణంగా పలు దారుణాలు జరుగుతున్నాయి. దీంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) అప్రమత్తమైంది. దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్‌జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది. అలాగే పబ్‌జితోపాటు ఇతర ఆన్‌లైన్ గేమ్స్ గురించిన సమాచారం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)ను కూడా ఆదేశించింది. మైనర్లు ఈ గేమ్ వల్ల బలవుతుండటం, నేరాలకు పాల్పడుతుండటంపై ఎన్‌సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. పబ్‌జిని దేశంలో నిషేధిస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈ గేమ్ అధికారికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ, అనధికారిక సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.

Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్‌’ బంపర్ ఆఫర్..

దీంతో చాలా మంది ఇప్పటికీ గేమ్ ఆడుతున్నారు. అయితే, నిషేధించిన గేమ్ ఆన్‌లైన్‌లో ఎలా అందుబాటులోకి వస్తుందో తెలపాలని ఎన్‌సీపీసీఆర్ కోరింది. అంతర్జాతీయంగా పబ్‌జిని ఇ-స్పోర్ట్‌గా గుర్తించారు. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా కూడా దీన్నిఇ-స్పోర్ట్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో పబ్‌జికి ఎలాంటి స్టేటస్ ఉందో తెలపాలని ఐఓఏను కోరింది.

×