Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

ఛత్తీస్‌ఘడ్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు నిరంతరం బాలుడిని రక్షించే పనులను పర్యవేక్షించారు.

Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..

Boy Rescued

Boy Rescued: ఛత్తీస్‌ఘడ్‌లో బోరుబావిలో పడిపోయిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు నాలుగున్నర రోజులుగా (110 గంటలు) బోరుబావిలోనే ఉన్న బాలుడిని రక్షణ సిబ్బంది, అధికారులు నిర్విరామంగా శ్రమించి క్షేమంగా బయటకు తీశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే పదకొండేళ్ల బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు.

Tirumala : ముగిసిన జ్యేష్టాభిషేకం

వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు దగ్గరుండి నిరంతరం బాలుడిని రక్షించే పనులను పర్యవేక్షించారు. సీఎం కూడా బాలుడి గురించి ఎప్పటికప్పుడు ఆరాతీశారు. బాలుడిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్టీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్)తోపాటు ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 80 అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు దాదాపు 70 అడుగల లోతున పడిపోయాడు. దాదాపు 110 గంటలపాటు గొయ్యి తవ్వి, తర్వాత మరో టన్నెల్ తవ్వి బాలుడ్ని రక్షించారు. బాలుడిని బయటకు తీసేందుకు అన్ని రకాల వనరుల్ని, టెక్నాలజీని ప్రభుత్వం వాడుకుంది. మంగళవారం సాయంత్రం బాలుడి నుంచి ఎలాంటి కదలిక లేదు. దీంతో అధికారులు ఆందోళన చెందారు.

Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్‌’ బంపర్ ఆఫర్..

తర్వాత ఆహారం కోసం మెల్లిగా స్పందించాడు. దీంతో మళ్లీ అధికారులు ఆశాభావంతో పనిచేశారు. దాదాపు 500 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాలుడిని బయటకు తీసిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడిని త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బాలుడు రాహుల్ సాహు సురక్షితంగా బయటపడటంపై ఛత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్ బఘెల్ హర్షం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.