Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి
ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి చరిత్ర సృష్టించింది.
![Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి](https://10tv.in/wp-content/uploads/2023/06/Satwiksairaj-Rankireddy-Chirag-Shetty.jpg)
Satwiksairaj Rankireddy - Chirag Shetty
Indonesia Open 2023: ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి చరిత్ర సృష్టించింది. ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడిని ఓడించి విజేతగా నిలిచింది. హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచిన మొదటి భారత జోడిగా రికార్డు నెలకొల్పింది.
Indonesia Open : సాత్విక్-చిరాగ్ జోడీ సంచలన ప్రదర్శన.. ఫైనల్స్‌కు
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk
— BAI Media (@BAI_Media) June 18, 2023
సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి ప్రదర్శన ఈ ఏడాది నిలకడగా ఉంది. ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్ షిప్లో విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను అందుకోగా మలేసియా ఓపెన్‌లో సెమీస్‌లో ఓడింది. అయితే.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటి విజేతగా నిలిచింది.