Indonesia Open : సాత్విక్‌-చిరాగ్ జోడీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఫైన‌ల్స్‌కు

ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి సంచ‌ల‌న ఆట‌తో ఫైన‌ల్స్‌కు దూసుకువెళ్లింది.

Indonesia Open : సాత్విక్‌-చిరాగ్ జోడీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఫైన‌ల్స్‌కు

Satwiksairaj-Chirag Shetty

Indonesia Open 2023 : ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడి సంచ‌ల‌న ఆట‌తో ఫైన‌ల్స్‌కు దూసుకువెళ్లింది. హోరా హోరీగా సాగిన పురుషుల డ‌బుల్స్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జే జోడిపై 17-21, 21-19, 21-18 తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా సూప‌ర్ 1000 టోర్నీలో ఫైన‌ల్‌కు చేరిన తొలి భార‌త జోడీగా రికార్డుల‌కు ఎక్కారు.

Suryakumar Yadav : 30 సెకన్లలో 3 రోజులు.. దేవీషాతో సూర్య‌కుమార్ యాద‌వ్‌

టోర్నీ ఆరంభం నుంచి సాత్విక్‌-చిరాగ్ జోడి దుమ్మురేపుతోంది. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచులో టాప్ సీడ్ ఫజర్ అల్ఫియాన్-ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను 21-13, 21-13 తేడాతో మట్టి క‌రిపించారు. వ‌రుస గేమ్‌ల‌లో ఓడించారు.

ఇంకోవైపు పురుషుల సింగిల్స్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్ఎస్ ప్ర‌ణ‌య్‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ డెన్మార్క్‌కు చెందిన అక్సెల్సెన్ చేతిలో 21-15, 21-15 తేడాతో ఓడిపోయాడు. కాగా.. ప్ర‌ణ‌మ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో జ‌పాన్‌కు చెందిన న‌రోకా పై 21-18, 21-16 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. అయితే.. సెమీస్‌లో ఓడిపోవ‌డంతో టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు.

Asia Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత‌.. ముందు ఆసియా క‌ప్‌ను కొట్టండి.. ప్రొమో అదిరిపోయింది