Indraja : పెళ్లైనా మగాడిని మగాడిగానే చూస్తారు.. ఓ ఆడదాన్ని మాత్రం.. నటి ఇంద్రజ వ్యాఖ్యలు..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంద్రజ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ఇంద్రజ మాట్లాడుతూ.. ''నటిగా నేనిప్పటి వరకు కొంత..

Indraja : పెళ్లైనా మగాడిని మగాడిగానే చూస్తారు.. ఓ ఆడదాన్ని మాత్రం.. నటి ఇంద్రజ వ్యాఖ్యలు..

Indraja

 

Indraja :  ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా..’ పాటతో అప్పట్లో ఏపీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇంద్రజ ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం సినిమాల్లో వరుస సినిమాలు చేసింది. మధ్యలో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చినా ఇటీవల మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తుంది. ఒక పక్క సినిమాలతో పాటు మరో పక్క టెలివిజన్ షోలలో కూడా అలరిస్తుంది ఇంద్రజ. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో ఇంద్రజ నటించింది. ఈ సినిమా మార్చ్ 18న రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంద్రజ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ఇంద్రజ మాట్లాడుతూ.. ”నటిగా నేనిప్పటి వరకు కొంత దూరమే ప్రయాణించాను. ఇంకా ప్రయాణించాల్సి దూరం చాలా ఉంది. ఇప్పుడొస్తున్న కథల్లో మహిళా క్యారెక్టర్‌ ఆరిస్ట్‌లకు అంత ప్రాధాన్యం ఉండటం లేదు. ఈ విషయంలో మార్పు వస్తే బాగుండు అనుకుంటున్నాను. నా దృష్టిలో నటికి పరిమితులు ఉండవు.”

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు ఎంతో తెలుసా??

”పెళ్లైనా మగాడిని మగాడిగానే చూస్తారు. ఓ ఆడదాన్ని మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టాక తల్లిగా గౌరవిస్తుంది ఈ సమాజం. ఇప్పుడు మమ్మల్ని అలా గౌరవించి చక్కటి తల్లి పాత్రలకు, అక్క పాత్రలకు పిలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు అలాంటి పాత్రలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది పెళ్లైన హీరోయిన్స్ కూడా సినిమాలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌. నేను పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టా. పాప పుట్టాక తనకి ఎనిమిదేళ్లు వచ్చే వరకు తన ఆలనాపాలనానే చూసుకున్నాను. ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తతం నాలుగు సినిమాలు నా చేతిలో ఉన్నాయి” అని తెలిపారు.