Instagram Verification Trick : మీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10K కన్నా తక్కువ ఫాలోవర్లు ఉన్నా.. బ్లూ టిక్ బ్యాడ్జ్ వెరిఫై చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Instagram Verification Trick : ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) త్వరలో బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను (Blue Tick) కొనుగోలు చేసేందుకు యూజర్లను అనుమతించనుంది.

Instagram Verification Trick : మీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10K కన్నా తక్కువ ఫాలోవర్లు ఉన్నా.. బ్లూ టిక్ బ్యాడ్జ్ వెరిఫై చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Instagram Verification Trick _ How to get verified on Instagram with less than 10K followers

Instagram Verification Trick : ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) త్వరలో బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను (Blue Tick) కొనుగోలు చేసేందుకు యూజర్లను అనుమతించనుంది. అయితే అప్పటివరకు, ఇన్‌స్టా యూజర్లు ప్రస్తుత సాంప్రదాయ పద్ధతి (Tradational Method)పై ఆధారపడాల్సి ఉంటుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఇతరులను గుర్తించడంలోనూ ఫాలో అయ్యే పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీలు, బ్రాండ్‌లను గుర్తించడంలో సాయపడుతుందని (Instagram) వివరిస్తుంది. అయితే బ్లూ టిక్ ఏళ్లుగా స్టేటస్ సింబల్‌గా మారింది. అదేవిధంగా, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్ కోసం బ్రాండ్‌లను ఆకట్టుకోవచ్చు. తద్వారా కంటెంట్‌ను మానిటైజ్ చేయడంలో క్రియేటర్లకు చాలా ఉపయోగపడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఎలా వెరిఫై చేయాలి? ముందుగా యూజర్లకు హెచ్చరిక.. సాంప్రదాయ పద్ధతి ద్వారా అప్లయ్ చేయడం వల్ల బ్లూ టిక్‌ (Blue Tick)కు ఎలాంటి గ్యారంటీ ఉండదని గమనించాలి. వినియోగదారులు భవిష్యత్తులో మళ్లీ దరఖాస్తు చేయాల్సి రావచ్చు. మీ ప్రస్తుత అభ్యర్థన రిజెక్ట్ అయితే.. మీరు 30 రోజుల్లో మళ్లీ కొత్త రిక్వెస్ట్ పంపవచ్చు. మీ నిర్ణయాన్ని స్వీకరించడానికి ముందు వెరిఫై చేసిన బ్యాడ్జ్ కోసం అనేకసార్లు దరఖాస్తు చేస్తే మాత్రం.. మీ దరఖాస్తు Reject అవుతుందని Instagram హెచ్చరిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో కనీసం 10వేల మంది ఫాలోవర్లు ఉన్న యూజర్‌లను మాత్రమే వెరిఫై చేస్తుందని తెలిసిందే. Instagram అధికారిక హెల్ప్ పేజీలో కనీస ఫాలోవర్ల సంఖ్య గురించి రివీల్ చేయలేదు. స్పష్టంగా చెప్పాలంటే.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ అకౌంట్లో బ్లూ టిక్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఫాలోవర్ల సంఖ్య 400 కన్నా తక్కువగా ఉంది. అంటే.. 10వేలు (1 లక్ష మంది కూడా) ఫాలోవర్లతో అనేక ముఖ్యమైన అకౌంట్లు ఉన్నాయి. అయితే, ఆ ప్రొఫైల్‌లలో ఎలాంటి బ్లూటిక్ లేదు.

Instagram Verification Trick _ How to get verified on Instagram with less than 10K followers

Instagram Verification Trick _ How to get verified on Instagram with less than 10K followers

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ బ్యాడ్జ్ పొందాలంటే? :
బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ కోసం అప్లయ్ చేయడానికి ముందు.. యూజర్లు కొన్ని ప్రాథమిక పద్ధతులను (Basic Requirements) పాటించాలి. ముందుగా, మీ అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి. బయోడేటాతో పాటు ప్రొఫైల్ ఫొటో కలిగి ఉండాలి. అది కూడా (Active)గా ఉండాలి. మీ ప్రొఫైల్ తప్పనిసరిగా పర్సన్ లేదా బ్రాండ్ లేదా ఎంటిటీ కోసం ఎక్కువగా సెర్చ్ చేసి ఉండాలి. అంటే.. పబ్లిక్‌కు బాగా తెలిసినదిగా ఉండాలని Instagram పేర్కొంది. అంతేకాదు.. మీ ఇన్‌స్టా అకౌంట్ ఎక్కువగా న్యూస్ కంటెంట్లో షేర్ అయి ఉండాలి. అయితే, వినియోగదారులు కమ్యూనిటీలో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాగా పాపులర్ అయి ఉండాలని అర్థం.

Read Also : Instagram Guide : ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో ‘Alt text’ ఫీచర్.. ఇకపై టెక్స్ట్ యాడ్ చేయడం.. మార్చడం ఎంతో ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

దీనికి సంబంధించి పూర్తి వివరణ పొందాలంటే YouTubeలో వీడియోలు చాలా ఉపయోగపడతాయి. గత 6 నెలల్లో న్యూస్ స్టోరీలలో మీ ఇన్‌స్టాగ్రామ్ పేరు అనేకసార్లు పోస్టు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే Instagram ఈ అకౌంట్ బ్లూటిక్ పొందడానికి అనుమతినిస్తుంది. బ్రాండ్‌ల కోసం, అఫిషియల్ హెల్ప్ పేజీలో Instagram పరిమిత సమాచారాన్ని కలిగి ఉంటుంది. అయితే, Instagram కూడా పరిగణించే Twitter అవసరాలకు అనుగుణంగా బ్రాండ్‌లు వెబ్‌సైట్, పబ్లిక్ పేజీ (వికీపీడియా పేజీ వంటివి), న్యూస్ స్టోరీలలో అట్రిబ్యూషన్, Google సెర్చ్‌లో ఎక్కువగా ట్రెండింగ్ అయి ఉండాలి.

ఇన్‌స్టాలో వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జ్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే? :
బేసిక్ రిక్వైర్‌మెంట్స్ పొందిన తర్వాత.. అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రక్రియ Android, iOS Instagram యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెబ్ పేజీ (Desktop)లలో అందుబాటులో లేదని గమనించాలి. సాంప్రదాయ పద్ధతి ద్వారా అప్లయ్ చేయడానికి Instagram app > Go to profile > Click on the hamburger icon in the top right corner > Settings > Account > Request Verification. వినియోగదారులు ఫారమ్‌ను నింపి IDని అందించాలి. సంబంధిత కేటగిరీని కూడా ఎంచుకోవలసి ఉంటుంది. అంటే.. blogger/ influencer, sports, news/media, business/brand/organization. మీ పేరు లేదా సంస్థను హైలైట్ చేసే సంబంధిత పేజీ లింక్‌లను సమర్పించండి. Instagram ప్రకారం.. వారి బృందం మీ దరఖాస్తును Review చేసిన తర్వాత మీరు మీ నోటిఫికేషన్‌ల ట్యాబ్‌లో Reply అందుకుంటారు.

మీరు ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ, ఇప్పటికీ వెరిఫికేషన్ చేయలేకపోతే.. Instagram పేరెంట్ Meta Meta Verified అనే సబ్‌స్క్రిప్షన్‌ను రిలీజ్ చేస్తోంది. భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. మీరు సభ్యత్వాన్ని పొందిన తర్వాత ప్రభుత్వ IDని ఇవ్వడం ద్వారా మీ ప్రొఫైల్‌కు బ్లూ కలర్ బ్యాడ్జ్‌ని యాడ్ చేసేందుకు Instagram యూజర్లను అనుమతిస్తుంది. మెటా వెరిఫైడ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వెబ్‌లో నెలకు 11.99 డాలర్లు (దాదాపు రూ. 990) లేదా iPhoneలలో నెలకు 14.99 డాలర్లు (దాదాపు రూ. 1,240)కి అందుబాటులో ఉంది.

Read Also : Instagram Blue Tick : ట్విట్టర్‌ మాత్రమే కాదు.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ్లూ టిక్ వెరిఫికేషన్‌‌‌‌కు చెల్లించాల్సిందే..!