iPhone 14 Plus Discount : ఆపిల్ ఐఫోన్ 14ప్లస్‌పై రూ. 10వేలు డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలే మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
iPhone 14 Plus Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఆన్‌లైన్‌లో ఐఫోన్లపై అద్భుతమైన డీల్ ఒకటి అందుబాటులో ఉంది.

iPhone 14 Plus Discount : iPhone 14 Plus selling with Rs 10,000 discount on JioMart, check out the deal
iPhone 14 Plus Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. ఆన్‌లైన్‌లో ఐఫోన్లపై అద్భుతమైన డీల్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు ఆపిల్ (iPhone 14 Plus) ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే, రిలయన్స్ (JioMart)లో ఆసక్తి కలిగించే కొన్ని ఆఫర్‌లను అందిస్తోంది. ఇటీవలే జియోమార్ట్ తమ ప్లాట్‌ఫారంపై స్పెషల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 26 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ సమయంలో JioMart ద్వారా పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లపై 80 శాతం వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Card) కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలుదారులు 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 2022లో రిలీజ్ అయిన ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14Plus)పై రూ. 10వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ (iPhone 14 Plus) 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,900గా ఉంటే.. 12 శాతం ఫ్లాట్ డిస్కౌంటుతో రూ.78,900కి కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, 256GB వేరియంట్ సాధారణంగా రూ. 99,900కి రిటైల్ అవుతుంది. ఈ సేల్‌లో రూ. 88,900కి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ హై-క్వాలిటీ కెమెరా, అడ్వాన్స్‌డ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలు, ఆకట్టుకునే స్టోరేజీ సామర్థ్యంతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో ఒకటి 128GB స్టోరేజ్ కాగా, మరొకటి 256GBగా అందుబాటులో ఉంది.

iPhone 14 Plus Discount : iPhone 14 Plus selling with Rs 10,000 discount on JioMart
iPhone 14 Plus : స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus), ఐఫోన్ 14 మాదిరిగానే అదే ఫీచర్లతో రన్ అవుతుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లే పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ సైజులో ఐఫోన్ 14 ప్రో మాక్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఐఫోన్ ప్రో మోడల్ వైడ్ నాచ్‌ను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్ కాదు. మీకు పెద్ద డిస్‌ప్లేతో ఐఫోన్ కావాలంటే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేకపోతే.. ఆపిల్ iPhone 14 Plus మీకు సరిగ్గా బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.
ఐఫోన్ ప్రాసెసర్ విషయానికొస్తే.. ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వచ్చింది. iPhone 13 లైనప్‌కు కూడా ఇదే ప్రాసెసర్ అవుతుంది. కెమెరాల పరంగా చూస్తే.. iPhone 14 Plus 12-MPతో పాటు 12-MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ iPhone 14 కెమెరా పర్ఫార్మెన్స్ మునుపటి కన్నా మెరుగ్గా ఉందని పేర్కొంది. ఐఫోన్ 14తో పాటు ఐఫోన్ 14 ప్లస్, iOS అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.