iPhone 14 Huge Discounts : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇమాజిన్ స్టోర్‌లోనూ ఐఫోన్లపై అదిరే డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 Huge Discounts : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా?

iPhone 14 Huge Discounts : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇమాజిన్ స్టోర్‌లోనూ ఐఫోన్లపై అదిరే డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 selling with huge discounts on Amazon, Flipkart and Imagine Store_ Check out the deals

iPhone 14 Huge Discounts : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్‌ న్యూస్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఐఫోన్ 14కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 14 మోడల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంల్లో ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale), అమెజాన్‌ (Amazon Sale)లతో పాటు ఇమాజిన్ స్టోర్ (Imagine Store) రూ. 4వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

మీకు HDFC బ్యాంక్ కార్డ్ ఉంటే మాత్రం.. ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్‌లు కూడా ట్రేడ్‌లో ఆప్షన్ కలిగి ఉన్నాయి. మీరు ఇమాజిన్ స్టోర్‌లో మీ పాత ఫోన్‌కి మెరుగైన వాల్యూను పొందే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో iPhone 14 సిరీస్‌లో ప్రామాణిక iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో సహా 4 మోడల్‌లు ఉన్నాయి. అందులో ఆపిల్ iPhone 14 డీల్స్ మాత్రం అసలే మిస్ చేసుకోవద్దు.

ఇమాజిన్ స్టోర్ (Imagine Store) :
ఐఫోన్ 14 బేస్ 128GB వేరియంట్ ఇమాజిన్ స్టోర్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 79,900గా లిస్టు అయింది. అయితే, స్టోర్ డివైజ్‌పై రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ.74,900కి తగ్గింది. ఈ డీల్‌ను మరింత తగ్గించాలంటే మీ HDFC కార్డ్‌ని ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఐఫోన్ 14పై రూ. 4000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

iPhone 14 selling with huge discounts on Amazon, Flipkart and Imagine Store_ Check out the deals

iPhone 14 selling with huge discounts on Amazon, Flipkart and Imagine Store

Read Also : iPhone 14 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?

మీ పాత ఫోన్‌ ద్వారా కూడా అద్భుతమైన డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీ పాత iPhone 12 అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా రూ. 35,000 కన్నా ఎక్కువ పొందవచ్చు. ఇమాజిన్ స్టోర్ వెబ్‌సైట్‌లో వాల్యూను చెక్ చేసినప్పుడు పాత iPhone 12కి రూ. 37,500 చూపింది. మీ పాత ఫోన్ వాల్యూ దాని కండిషన్, బ్యాటరీ హెల్త్, తయారీ సంవత్సరం ఆధారంగా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) :
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14ను రూ.73,900కి విక్రయిస్తోంది. ఈ డివైజ్ ధర అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింది. మీరు HDFC కార్డ్ కలిగి ఉంటే.. మీరు డివైజ్‌పై రూ. 4000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా, మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీ పాత డివైజ్‌పై రూ. 20వేల కన్నా ఎక్కువ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో పాత ఐఫోన్ 12 వాల్యూను చెక్ చేసినప్పుడు రూ. 23వేల వరకు చూపిస్తుంది.

అమెజాన్ (Amazon) :
Amazon ఐఫోన్ 14లో కూడా ఇదే విధమైన డీల్ అందిస్తోంది. ఫోన్ అమెజాన్‌లో రూ. 73,900గా లిస్టు అయింది. అయితే మీకు HDFC బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీరు డివైజ్‌పై రూ. 4000 డిస్కౌంట్ పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఎక్స్ఛేంజ్ వాల్యూను రూ. 18,000 వరకు పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఏయే ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే?