iPhone 14 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?
iPhone 14 Pro Discount : 2023 ఏడాదిలో కొత్త ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro) సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

iPhone 14 Pro and iPhone 13 Pro get big discount
iPhone 14 Pro Discount : 2023 ఏడాదిలో కొత్త ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro) సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ ప్రో వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్ మోడల్ అసలు రిటైల్ ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 13 ప్రో ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ డీల్‌ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై భారీ తగ్గింపు :
అమెజాన్‌లో ఐఫోన్ 13 ప్రో రూ. 1,07,900 భారీ తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. భారత మార్కెట్లో గోల్డ్ ఫినిషింగ్‌తో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,19,900తో అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లు రూ. 12వేల తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 14 ప్రో కొంచెం ఖరీదైనది. ఎందుకంటే.. కొత్త మోడల్ కొన్ని నెలల క్రితం రూ. 1,29,900కి లాంచ్ అయింది. విజయ్ సేల్స్ ప్రస్తుతం రూ.1,26,100కి ఆఫర్ చేస్తోంది. దీని మీద రూ. 3,800 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. మీరు కొత్త (గోల్డ్) వెర్షన్‌పై కనీసం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా చెక్ చేయొచ్చు. ఐఫోన్ ధరను కొంత మార్జిన్‌తో పొందవచ్చు. మీరు ఐఫోన్ ప్రో మోడల్‌లపై మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.

iPhone 14 Pro and iPhone 13 Pro get big discount
ఐఫోన్ 14 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రో.. ఏది కొనాలంటే? :
రెండు ఐఫోన్ల మధ్య ధరలో చాలా వ్యత్యాసం ఉంది. ఐఫోన్ 14 మోడల్ కొనుగోలు చేయాలంటే సుమారు 1.26 లక్షలు ఖర్చు చేయాలి. లేదంటే.. iPhone 13 ప్రోని కొనుగోలు చేయవచ్చు. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కోరుకునే యూజర్లు ఐఫోన్ 14 ప్రో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొత్త జనరేషన్ ఫోన్‌లో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్13 ప్రో మోడల్ కొనుగోలు చేయాలంటే.. ఎక్కువ లేదా తక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. రెండు ఫోన్‌లు ఒకే డిస్‌ప్లే, బ్యాటరీని కలిగి ఉంటాయి. చిప్‌సెట్ కొత్తదిగా ఉంటుంది. కానీ, చిన్న తేడాతో ఎక్కువ లేదా తక్కువ అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

iPhone 14 Pro and iPhone 13 Pro get big discount
ఆపిల్ ఆరేళ్ల పాత ఫోన్‌లకు కూడా అప్‌డేట్‌లను అందిస్తుంది. డిజైన్ విభాగంలో అతిపెద్ద వ్యత్యాసాలలో ఒకటిగా ఉంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో కొత్త పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ కలిగి ఉంది. లేటెస్ట్ వెర్షన్‌లో కొత్తగా భారీ 48-MP ప్రైమరీ కెమెరా ఉంది. మిగిలిన సెన్సార్‌లు ఐఫోన్ 13 ప్రో మాదిరిగానే ఉంటాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్.. అంతకంటే ముందు వెర్షన్‌తో పోలిస్తే.. ఐఫోన్ 14 ప్రో షాట్‌లను చూడవచ్చు. అదనంగా, రెండు ఫోన్‌లకు 2x జూమ్ సపోర్టు అందిస్తుంది. అయితే iPhone 13 ప్రోలో అందుబాటులో ఉన్న డిజిటల్ జూమ్‌తో పోలిస్తే.. iPhone 14 ప్రో ఆప్టికల్ జూమ్ క్వాలిటీని అందిస్తుంది. 2x ఆప్టికల్ జూమ్ సహజంగా కనిపించే పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..